పుట:Punitha Matha.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏర్పడ్డాయి. అతడు మనకు పెద్దన్న కాగలిగాడు. మనము అతని తమ్ముళ్లమూ, చెల్లెళ్లమూ అయ్యాం. దేవుణ్ణి నరుని వద్దకు కొనివచ్చి నరుని దేవుని వద్దకు కొనిపోయే ధన్యురాలు మరియ.

2. విశ్వాసుల మాత

మరియు దేవమాత మాత్రమే కాదు. విశ్వాసులమాత కూడ. ఎలాగ? ఆమె క్రీస్తమాత అన్నాం. క్రీస్తులోకి జ్ఞానస్నానం పొందే వాళ్లంతా అతనితో ఐక్యమౌతారు. అతడు వాళ్లకు శిరస్సు వాళ్లు అతని దేహం -రోమ 12, 5. అతడు తల్లితీగ, వాళ్లు అతనిలోకి అతుకుపోయిన రెమ్మలు -యోహా 15, 5. అతడు పునాదిరాయి. వాళ్లు అతనిమీద భవనంగా నిర్మింపబడే సజీవశిలలు - 1 పేత్రు25. ఈ క్రీస్తు పూర్తిక్రీస్తు జ్ఞానక్రీస్తు అనగా రక్షకుడూ, రక్షణం పొందవలసిన వాళూను. ఇక క్రీస్తును కన్న మరియమాత ఈ పూర్తి క్రీస్తును కూడ కంది. అనగా క్రీస్తు మాత, క్రీస్తుతో ఐక్యమైన మనకూ తల్లిఔతుంది. అందుకే ప్రభువు కల్వరిమీద శిష్యునితో "ఇదిగో నీ తల్లి" అని వక్కాణించాడు -యోహా 19,27. ఇక్కడ యీ శిష్యుడు క్రీస్తును నమ్మే శిష్యులందరికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కనుక ఆమె మనకందరికీ తల్లిగా ఈయబడింది. ఆ తల్లి క్రీస్తును గర్భంలో ధరించి నపుడే మనలను కూడ తన ఉదరంలో మోసింది. శిరస్సు అవయవాలతో గూడిన పూర్తి క్రీస్తునకు ఆమె జనని. ఇక్కడ ఒక్కటే భేదం. ఆమె క్రీస్తుకు భౌతికంగా జనని. మనకు మాత్రం జ్ఞానరీత్యా తల్లి అనగా మనం జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుతో ఐక్యం గావడం వలన ఆమె మనకు తల్లి ఔతుంది. L