పుట:Punitha Matha.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోషించే పోషకుణ్ణి స్వయంగా చనుబాలతో పోషించి పెద్దచేసింది. భూమ్యాకాశాలు భరించలేని విశ్వభర్తను తన ఉదరంలో భరించింది. ఆ మరియ మహిమను కొనియాడ్డం ఎవరి తరం?" అని వ్రాశాడు. మరియు దేవమాత. మానవుల మాత. ప్రస్తుతం ఆ పునీతమాతను గూర్చి నాల్గంశాలను విచారిద్దాం.

1. దేవమాత

మరియమాత ఎలా దేవమాత ఔతుంది? క్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి. అతడు నరుడూ, దేవుడునూ. ఐనా ఈ క్రీస్తు ఇద్దరు వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తి అతడు దేవుడూ మానవుడూ ఐన క్రీస్తు దైవవార్త మానుష దేహాన్నిస్వీకరింపగా క్రీస్తు ఆవర్బివించాడు. ఈలా మానవుడు దేవుడూ ఐన ఏకైక వ్యక్లిని మరియ కంది. ఆమెకు పుట్టిన కుమారుడు క్రీస్తు మొదట దేవుడై అటుతరువాత మానవుడు కాలేదు. లేదా మొదట మానవుడై తర్వాత దేవుడు కాలేదు. అతడు మొదటి నుండి దేవుడూ మానవుడూను. అతడు దేవుడూ మానవుడూ కనుక అతన్ని కన్న తల్లికూడ దేవునికీ మానవునికీ తల్లి ఔతుంది. అందుచేత ఆమెను "దేవమాత" అని పిలుస్తుంటాం.

ఈలా దేవమాత కావడం కోసమే మరియు పాపం లేకుండా నిష్కళంకంగా ఉద్భవించింది. ఇందుకోసమే ఆమె కన్యగా వుండిపోయి ప్రభువుకి తననిండు హృదయాన్ని సమర్పించుకుంటుంది. ఇందుకొరకే ఆమె సకల వరప్రసాదాలూ పొంది సుందరమైన వధువుగా తయారైంది.

మరియు దేవమాత కావడమంటే యేమిటి? ఆమె మూలంగా దేవుడు మన మానవ కుటుంబంలోకి దిగివచ్చాడు. మన మంటిమీద అడుగుపెట్టాడు. ఆమె వలన క్రీస్తునందు మన రక్తమాంసాలు