పుట:Punitha Matha.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన ఈ దేహం జ్ఞానస్నానం ద్వారా ప్రభువుకే నివేదితమైంది. కనుక మనం అశుభ్రవర్తనంతో ఈ దేహాన్ని అమంగళ పరచకూడదు. క్రైస్తవుడు ఈ దేహంతోను పాపం చేయకూడదు, ఈ దేహంలోను పాపం చేయకూడదు -1కొ 6, 18. ఆ పునీత కన్య తన దేహాన్ని శుచిమంతంగా కాపాడుకుంది. మనమూ వున దేవహాలను శుచిమంతంగా వుంచుకునేలా సాయపడమని ఆ తల్లిని వేడుకుందాం.

మరియు దేవునికి నివేదిత. అలాగే మనమూ మనబిడ్డలను దైవ సేవకు అర్పిస్తుండాలి. పూవును కోసిముచ్చటగా జడలో ముడుచు కోవడం మంచిదే. కాని అదే పూవుని భగవంతుని పీఠం మీద సమర్పిం చడం ఇంకా యోగ్యమైంది. అలాగే మన బాలికను ఓ పురుషునికి సమర్పించడం మంచిదే. కాని దేవునికి అంకితం చేయడం ఇంకా యోగ్యమైన పని. మన పుత్రులను దైవసేవకు అర్పించడమూ ఈలాం టిదే. మరియు మనకు ఈలాంటి కోరికలు కలిగించాలని వేడుకుందాం. మరియు దేవునికి అంకితమైన భక్తురాలు. ఆమెను చూచి మనం కూడ హృదయం దేవునివైపు మరల్చడం నేర్చుకోవాలి. మన హృదయం ఈ లోక సుఖభోగాలతో సంతృప్తి చెందలేదు. అది దేవునికోసం కలిగింప బడింది. ఆ దేవుని ప్రేమించి ఆ దేవునియందు విశ్రమిస్తేగాని దానికి విశ్రాంతి అంటూ వుండదు. కనుక మన హృదయాలను దేవునివైపు మరల్చే భాగ్యంకోసం గూడ ఆ తల్లిని మనవి చేద్దాం.

3. దేవమాత

సిరియాదేశ భక్తుడు ఏప్రేము "మరియు తన చేతుల్లో నిప్పను నిలుపుకుంది. తనబాహువులతో అగ్నిజ్వాలను ఆలింగనం చేసుకుంది. ఈ యగ్నిజ్వాలను ఆమె స్క్రోండి సమస్త ప్రాణికోటిని