పుట:Punitha Matha.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ శక్తి శారీరకమైంది కాదు. పరిశుద్ధాత్మ మరియకు భర్తకాదు. క్రీస్తుకు తండ్రీకాదు. అసలు పరిశుద్ధాత్మ కేవలం ఆత్మ స్వరూపం. కనుక మరియమిద పనిచేసింది భౌతిక శక్తిగాదు. ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తినే బైబులు చాలాతావుల్లో “అభిషేకం" అని పిలుస్తుంది. ఆత్మ మరియను అభిషేకించింది. అనగా ఆమె యందు ఆంతరంగికంగా, ఆధ్యాత్మికంగా చైతన్యం కలిగించింది. కలిగించి ෂර්‍ය స్వయంగానే బిడ్డనుకనే శక్తిని ప్రసాదించింది. ఈ అభిషేకం వలననే క్రీస్తుకూడ శక్తిని పొంది మెస్సియగా, దేవుని ప్రతినిధిగా బహిరంగ జీవితం ప్రారంభించాడు -లూకా 4, 18. ఈ అభిషేకం వలననే మనంకూడ జ్ఞానస్నాన సమయంలో ఆధ్యాత్మిక శక్తిని పొంది దేవుని బిడ్డలమూతాం -1యేూ 2,27. మరియుకూడ ఈలాంటి అభిషేకం వలననే గర్భవతి ఐంది. నూతవేద ప్రజల్లో మొదట పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి మరియమాత. ఈయాత్మ శక్తి వలననే ఆమె నరుణ్ణి దేవునితో, దేవుణ్ణి నరునితో జోడింప గలిగింది. దేవుణ్ణి నరుణ్ణి చేసి నరుణ్ణి దేవుణ్ణి చేయగలిగింది.

3. మరియ కన్యగా ఉండిపోవటానికి కారణాలు

మరియ నిత్యకన్యగా ఉండిపోయిందన్నాం.ఎందుకు? ఆమె దేవునికి తల్లిగా ఎన్నుకోబడింది. కనుక తాను పూర్తిగా దేవునికే చెంది వుండాలి. పూర్తిగా దైవసేవకే అంకితం కావాలి. తాను అన్యులకు చెందిపోగూడదు. పౌలు "వివాహిత భర్తనేలా సంతోషపెట్టాలా అని రేయింబవళ్లు భర్త సంబంధ విషయాలలో సతమత మౌతుంటుంది. కాని ప్రభువునకు సమర్పితయైన కన్య ప్రభువునెలా సంతోష పెట్టాలాఅని ఆందోళన పడుతూ దేహంనందూ ఆత్మ యందూ