పుట:Puneetha Paul bodhalu 2.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయసూచిక

3. ఫిలిప్పీయుల జాబు

4. ఎఫెసీయుల జాబు

5. కొలొస్సీయుల జాబు

6. రోమా పౌరులు జాబు

3.ఫిలిప్సీయుల జాబు

1. పరిచయం

పౌలు 55 ప్రాంతంలో, బహుశ ఎఫేసు చెరనుండి ఈ జాబు వ్రాసాడు. ఫిలిప్పి మాసెడోనియా రాష్ట్రంలోని నగరం. పౌలు రెండవ పేషిత ప్రయూణంలో ఇక్కడ వేదబోధచేసి క్రైస్తవసంఫనాన్ని స్థాపించాడు. యూరపులో మొట్టమొదటిసారిగా వేదబోధ జరిగింది ఈ నగరంలోనే.

ఇది ఒకజాబు కాదు. మూడు జాబుల సమ్మేళనం. ఎవరో సంపాదకుడు వీటిని కలిపివేసాడు.

జాబు వ్రాసిన సందర్భం ఇది. యూదమతాభిమానులు పౌలుకి వ్యతిరేకంగా బోధిస్తున్నారు. కనుక సమాజాన్ని హెచ్చరిస్తూ పౌలు ఈ జాబు వ్రాసాడు. ఇంకా, ఆ సంఘంలో తగాదాలు వున్నాయి. అక్కడ ఇద్దరు నాయకురాళ్లు పోట్లాడుకొంటూన్నారు. సంఘానికి ఐక్యతను బోధించడానికి గూడ ఈ లేఖ వ్రాసాడు. పైగా, ఫిలిప్పీయులు పౌలుకి ఆర్థిక సహాయం చేసారు. వారికి కృతజ్ఞత తెల్పడానికి కూడ ఈ లేఖ వ్రాసాడు.

ఈ జాబుకి ఓ ప్రత్యేకతవుంది. ఇది సంతోషభావాలతో నిండి వుంటుంది. పౌలు ఫిలిప్పి విశ్వాసులను విూరు ప్రభువునందు ఆనందించండి అని చెప్పాడు -3,1. ఇంకా, పౌలుకి ఫిలిప్పీయులంటే యిష్టం. అతడు వారి పట్ల ప్రేమ, ఆప్యాయత వెల్లడి చేసాడు. విూరు నా ఆనందం అని పేర్కొన్నాడు - 4,1.