పుట:Puneetha Paul bodhalu 2.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని కూడ పేరు. అనగా దేవుడే దివ్యసత్యాలను నరులమైన మనకు తెలియజేసాడని భావం.

బైబులు తన లక్షణాలను కొన్నిటిని తానే చెప్పకుంటుంది. అది పవిత్ర లేఖనాలు -2తిమొు 3,15. అది ప్రవచనం. అనగా నరులను నుండి కాక దేవుని నుండి ఉద్భవించింది -2 పేతు 1,21. అది దీపం. అనగా మనకు దారి చూపేది - కీర్త 119,105. అది సజీవమైంది - హీబ్రూ 4,12. అది అద్దం - యాకో 1,23. అనగా దానిలో మనలను మనం చూచుకోవచ్చు. ప్రజలు బైబులు వాక్కుని స్వీకరించాలి, నమ్మాలి, ధ్యానం చేసికోవాలి, అనుసరించాలి.

2. బైబుల్లోని ముఖ్యాంశాలు

బైబులు దేవుణ్ణి గూర్చి, నరుని గూర్చీ చెప్పంది. ప్రధానంగా దేవుణ్ణి వర్ణిస్తుంది. భగవంతుడు ఏలాంటివాడో, అతడు తన్ను గూర్చితాను ఏమి తెలియచేసి కొన్నాడో, అతడు నరుల కొరకు ఏమి చేస్తాడో విశదీకరిస్తుంది. నరుణ్ణి గూర్చి కూడ చాల విషయాలు చెప్పంది. నరుల్లో శరీరం ఆత్మ అనే రెండు అంశాలున్నాయనీ, వాళ్లు తాము చేసిన మంచి పనులకూ చెడ్డ పనులకూ గూడ బాధ్యులౌ తారని తెలియజేస్తుంది.

ఇంకా దేవునికీ నరులకీ గల నింతర సంబంధాన్నీ చూపిస్తుంది. నరుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు తన తరపున తాను నరుణ్ణి ప్రీతితో ఆదరిస్తాడు. దేవునికీ నరునికీ గల సంబంధమే నిబంధనం. ఈ సంబంధాన్ని చెరిచేది నరుని పాపం.

నరులు చెడ్డను చేసి దాని వలన నానా శ్రమలు అను భవిస్తారు. ఈ యంశాన్ని గూడ బైబులు విపులంగా పేర్కొంటుంది. ఇంకా బైబుల్లో దేవుడు చేసిన క్రియలు స్పష్టంగా కన్పిస్తాయి. అవి దేవుడు సృష్టిచేయడం, ప్రాణులను పోషించడం. ఈఇపు విమోచనం, రక్షణం మొదలైనవి. ఆలాగే నరులు చేసే మంచి క్రియలు చెడ్డ క్రియలూ కూడ పేర్కొంటుంది. దేవుని క్రియలకూ నరుల క్రియలకూ దగ్గరి సంబంధం వుంటుంది. ఈ రెండింటినీ