పుట:Puneetha Paul bodhalu 2.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. బైబుల్లో ఏముంది?

1. బైబులు పేరు

బైబులు రచయితలు పవిత్రగ్రంథానికి దేవుని వాక్కు అని పేరుపెట్టారు. వాక్కు కనుక అది ఓభాషలో వుంటుంది. ఆ భాష నరునికి అర్థమౌతుంది. ఆ భాషను మాటలాడినవాడు భగవంతుడే. అతడు నరమాత్రులద్వారా ఆ భాషను మాటలాడాడు.

ఈ గ్రంథానికి లేఖనాలు, పుస్తకపు చుట్టలు అనికూడ పేరు. పవిత్రగ్రంథం నరులచే వ్రాయబడినది. కనుక మామూలు పుస్తకాలకు వుండే గుణాలు దానికి కూడ వుంటాయి.

ఈ పుస్తకానికి ధర్మశాస్త్రం అని కూడ పేరు. ప్రభువు పూర్వం సీనాయి కొండదగ్గర మోషే ద్వారా ధర్మశాస్తాన్ని దయచేసాడు. దీనిలో అనేక నియమాలున్నాయి. ప్రజలు ఈ నియమాలను పాటించాలి. బైబులు జీవిత సూత్రాలనూ, నియమాలనూ నేర్పే గ్రంథం.

అసలు బైబులంటే పుస్తకం అని అర్థం. పుస్తకాలు అనే అర్థం కల "బిబ్లియా" అనే ల్యాటిన్ మాటనుండి బైబులు అనే పదం వచ్చింది. ఇది ఒక పుస్తకం కాదు. చాల గ్రంథాల సముదాయం. చాల శతాబ్దాల పొడుగున రచయితలు ఈ పుస్త కాలను వ్రాసారు.

బైబుల్లో ప్రాతనిబంధనం, నూత్న నిబంధనం అని రెండు భాగాలున్నాయి. ప్రాత నిబంధనం దేవుడు సీనాయి కొండదగ్గర మోషే ద్వారా ప్రజలతో కుదుర్చుకొనిన పొత్తును గూర్చి చెప్పంది. నూత్న నిబంధనం దేవుడు క్రీస్తు ద్వారా, ప్రజలతో కుదుర్చుకొనిన పొత్తును గూర్చి చెప్పంది. ఈ రెండిటికీ దగ్గరి సంబంధం వుంది. పాత నిబంధనం వాగ్దానం. నూత్ననిబంధనం నెరవేరుదల.

బైబులుకి దైవోక్తులు అనికూడ పేరు. అవి దేవుడు పలికిన పలుకులు. కనుక మనకు ఆచరణీయాలు. ఇంకా దానికి దివ్యశ్రుతి