పుట:Puneetha Paul bodhalu 2.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రమలు. ఇవి యొప్పుడూ అపరిపూర్ణంగా కొదవగా వుంటాయి. పౌలు పూర్తి చేసింది, ఇప్పుడు మనం పూర్తి చేయవలసింది కూడ, ఇవే.


6. రోమా పౌరులు జాబు

1. పరిచయం
స్థలకాలాలు

పౌలు 57-58 ప్రాంతంలో, మూడవ ప్రేషిత ప్రయాణంలో కొరింతు నుండి ఈ జాబు వ్రాసాడు. దీన్ని ఫీబె అనే పరిచారకురాలి ద్వారా రోముకి పంపాడు. రోములో గ్రీకు, యూదక్రైస్తవులు వున్నారు. ఈ సంఘాన్ని పౌలు స్థాపించలేదు.

సందర్భం

పౌలు తూర్పుతీరాన వేదబోధ ముగించాడు. పశ్చిమాన గల స్పెయినుకి వెళ్లి వేద బోధ చేయాలనుకొన్నాడు. రోముమినాదిగా స్పెయినుకి వెళ్లగోరాడు. కనుక రోమనులతో పరిచయం కలిగించుకో వడానికి ఈ జాబు వ్రాసాడు. ఇంకా, అతడు గ్రీకు క్రైస్తవులనుండి ప్రోగుజేసిన చందాను యూదక్రైస్తవులకు సమర్పించి ఆమిరాదట రోముకి వెళ్లాలను కొన్నాడు. కనుక రోముకి జాబు వ్రాసాడు. పైగా, తనకు విరోధులైన యూద క్రైస్తవులకు తన భావాలను వివరించి చెప్పాలన్న ఉద్దేశంతో గూడ దీన్ని వ్రాసాడు.

ప్రాముఖ్యం

ఇది పాలు జాబుల్లో కెల్ల శ్రేష్టమైంది. దైవశాస్త్రరీత్యా చాల లోతైంది. చాలమంది వేదపండితులు ప్రాచీనులూ ఆధునికులూ కూడ దీనిమిద వ్యాఖ్యలు వ్రాస్తారు. 16వ శతాబ్దంలో ప్రొటస్టెంటు నాయకుల వాదానికి ఈ లేఖ ఆధారమైంది. నూత్న వేదంలో నాలు సువిశేషాలూ అపోస్తుల చర్యలూ తర్వాత ඝඨි ముఖ్యగ్రంథం. గలతీయుల జాబు దీనిలోను కూడ ధర్మశాస్త్రం ఇక చెల్లదు, క్రీస్తుని విశ్వసించడం ద్వారా మాత్రమే రక్షణం కలుగుతుంది అనే భావం వస్తుంది. గలతీయుల జాబు విరోధులతో వాదించినట్లుగా వుంటుంది. ఉద్రేకంతో నిండివుంటుంది. ఈ జాబు పౌలు విరోధులకు తన అభిప్రాయాలను ప్రశాంతంగా వివరించినట్లుగా వుంటుంది.