పుట:Puneetha Paul bodhalu 2.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తప్పచేసిన వాళ్లు మందలింపును స్వీకరించాలి. ఈ ప్రక్రియవల్ల సమాజంలో విశ్వాసం బలపడుతుంది. భక్తి పెరుగుతుంది.

3. ఆరాధనలో, బృంద ప్రార్ధనలో కీర్తనలు, పాటలు స్తుతిగీతాలు పాడాలి. దీనివల్ల ఆరాధనలో భక్తి పెరుగుతుంది. క్రైస్తవారాధనలో తొలిశతాబ్దాల నుండి కీర్తనలు, పాటలు పాడేవాళ్లు. దీనివల్ల హృదయం ద్రవించి దేవుడు అనుభవానికి వచ్చేవాడు. కనుక భక్తి సంగీతాన్ని బాగా ప్రోత్సహించాలి.

4. దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. ఈ కృతజ్ఞత మన క్రైస్తవ విశ్వాసానికి కావచ్చు. దివ్యసత్ర్పసాద బలికి కావచ్చు. వరప్రసాదానికి కావచ్చు. క్రైస్తవుడు ప్రధానంగా దేవునికి వందనాలు చెప్పుకోవాలి.

5. మన పనులన్నీ క్రీస్తు పేరుమిఠాదిగా జరగాలి. మన పలుకులన్నిటిని అతని పేరు మిరాదిగా పలకాలి. అనగా మన మాటలు క్రియలు అతనికి తగినట్లుగా వుండాలి. అతనికి సమర్పించడానికి యోగ్యంగా వుండాలి. క్రీస్తు మనకు ప్రధాన మధ్యవర్తి కనుక మన క్రియలన్నీ అతనికి అర్పితం కావాలి.

ఈ పంచసూత్ర భక్తిని పాటిస్తే మన జీవితం పవిత్రమాతుంది.

కడన పౌలు వాక్యాన్ని ఒకదాన్ని మననం చేసికొందాం. "క్రీస్తు తన శరీరమైన తిరుసభకొరకు పడిన శ్రమలలో కొదవగా వున్నవానిని నాశ్రమల ద్వారా పరిపూర్తి చేయుచున్నాను - 1, 24 క్రీస్తు తీరుసభ కొరకు శ్రమలు అనుభవించాడు. ఈ శ్రమలు అతని భక్తుల జీవితాల్లో గూడ కొనసాగుతాయి. అసలు క్రీస్తే తన అనుచరుల జీవితంలో శ్రమలు అనుభవిస్తూపోతాడు. ఈయనుచరుల బాధలు క్రీస్తు బాధలతో కలసి తిరుసభకు మేలు చేస్తాయి. కనుక పౌలు నానా బాధలు అనుభవించి ఆనాటి తిరుసభను బలపరచాడు. నేడు మనం మనబాధల ద్వారా ఈనాటి తిరుసభను బలపరచాలి.

క్రీస్తుశ్రమలు రెండు రకాలు. మొదటిది, ఆత్మార్పణ శ్రమలు. అనగా అతని సిలువ మరణానికి చెందిన శ్రమలు. ఇక్కడ ఏ కొరతా లేదు. సిలువబలి పరిపూర్ణమైందే. రెండవది, అతడు తన సేవకుల్లో పదేశ్రమలు. అనగా క్రీస్తుభక్తులు క్రీస్తు పేరుమిదిగా అనుభవించే