పుట:Puneetha Paul bodhalu 2.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
3. హృదయం పరలోక వస్తువులమిద 3,1-4

జ్ఞానస్నానం ద్వారా విశ్వాస్తులు క్రీస్తుతో చనిపోయి అతనితో ఉత్థానమయ్యారు. మోక్షంలో క్రీస్తు తండ్రి సమక్షంలో ఆసీనుడై యున్నాడు. తండ్రి అతన్ని విశ్వానికి అంతటికీ రాజుగా నియమిం చాడు. కనుక మన మనసు కోరికలు అన్నీ ఆ పరలోకం విూద నిలవాలి. ఈ లోక వస్తువల విూద నిలవకూడదు. మామూలుగా మనం ఈ లోకానికీ ఇక్కడి వస్తువులకీ అంటిపెట్టు కొని వుంటాం. కాని మనం ఉత్థాన ప్రజలం. మన ఉత్థానం ఇది వరకే, మన జ్ఞానస్నానంలోనే జరిగింది. ఉత్థాన ప్రజల్లాగ వున దృష్టి పరలోకంమిచాద, అక్కడి వస్తువులమిద నిలవాలి.

మన ఉత్థాన తేజస్సు ప్రస్తుతం క్రీసులో దాగివుంది. వెలుపలికి కన్పించదు. క్రీస్తు రెండవసారి వచ్చినపుడు మన ఉత్థాన తేజస్సు బట్టబయలుగా కన్పిస్తుంది. -

మన దృష్టి ఉత్థాన క్రిస్తుమివాద నిలవాలి. సంపదలు ఉన్న చోటనే హృదయం వుంటుంది కదా - మత్త 6,21, లోకాశలను జయించి ఉత్థాన క్రీస్తుపై దృష్టినిల్పి దివ్యమైన జీవితం గడపాలి. రెండవ రాకడలో మనం కూడ మహిమను పొందుతాం.

ఈ వేదభాగం క్రీస్తు ఉత్తానపూజలో మొదటి పఠనంగా వస్తుంది. బాగా ప్రేరణం పుట్టించేది. కనుక పలుసార్లు మననం చేసికోదగ్గది.

4. భక్తి మార్గం 3,16-17

ఉత్థాన ప్రజల జీవితం ఏలా వండాలి? రచయిత విశ్వాసుల భక్తిమార్గానికి ఐదు సూత్రాలు చెప్పాడు. అవి యివి.

1. భక్తుల హృదయాలు క్రీస్తుని గూర్చిన బైబులు వాక్కుతో నిండివుండాలి. ఈ వాక్కు ద్వారా క్రీస్తు వాళ్ల హృదయాల్లో వసిస్తాడు. ఈ వాక్కు మనకు బైబులుపఠనం ద్వారా బోధకుల బోధద్వారా కూడ లభిస్తుంది. దైవవాక్కు హృదయాలను కదిలించి సత్కార్యా లకు ప్రేరేపిస్తుంది.

2. విశ్వాసులు ఒకరికొకరు జ్ఞానాన్ని బోధిసుండాలి. త్రోవదప్పినపుడు ఒకరినొకర@ురించి మందలిసూవుండాలి.