పుట:Puneetha Paul bodhalu 2.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. కొలోసీయుల జాబు

1. పరిచయం

రచయిత ఈ జాబు పౌలు స్వయంగా వ్రాసింది కాదు. అతని అనుయాయులు ఎవరో పౌలు పేరుమినాదిగా వ్రాసారు. పౌలు భావాలకూ దీనిలోని భావాలకూ కొన్ని తేడాలు వున్నాయి. ఈ జాబు కొలొస్సే సమాజానికి వ్రాయబడినట్లు కన్పిస్తున్నా యథార్థంగా మరేదో సమాజానికి వ్రాసారు. -

కాలం : 80 ప్రాంతంలో ఎఫెసు నగరం నుండి ఈ లేఖను వ్రాసినట్లుగా కన్పిస్తుంది. లేఖలో మాత్రం పౌలు చెరనుండి దీన్ని వ్రాసినట్లుగా వుంది. అది నిజంకాదు.

సందర్భం: కొలోస్సే సమాజాన్ని నూత్నవ్యక్తులు కొందరు అపమార్గం పట్టించారు. వీళ్లు క్రీస్తుతో పాటు దేవదూతలను కూడ ఆరాధించాలనీ, రక్షణం వీరినుండి కూడ వస్తుందనీ చెప్పారు. సున్నతి మొదలైన యూదుల ఆచారాలను పాటించాలని వాదిం చారు. ఇంకా యూదుల పండుగలు భోజన నియమాలు మొదలైన వాటిని కూడ అనుసరించాలని బోధించారు. వీరి బోధలవల్ల క్రీస్తు ప్రాముఖ్యం దైవత్వం తగ్గిపోయేలా వుంది. ఈ పరిస్థితుల్లో ఆ కాలపు క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచి పదిలం చేయడానీకి రచయిత ఈ జాబు వ్రాసాడు. ఇది లోతైన దైవశాస్త్ర భావాలతో నిండివుంటుంది. పౌలు భావాలనే ఎత్తుకొన్నా వాటిని మించిపోయి నూత్నాంశాలను కూడ చేరుస్తుంది. ఎఫెసీయుల జాబు దైవసంఘానికి ప్రాముఖ్యం ఇచ్చినట్లే యిది క్రీస్తుకి ప్రాముఖ్యం ఇస్తుంది. ప్రసుతం ఈ లేఖనుండి మూడంశాలు పరిశీలిద్దాం.

2. క్రీస్తు గీతం 1,15-20

ఈ గీతం ప్రసిద్ధమైంది. ఇది రచయిత స్వయంగా వ్రాసింది కాదు. అతడు ఆనాడు దైవార్చనలో వాడుకలో వున్న ఓ పాటను తన భావాలను విశదీకరించడానికి అనువుగా వుంటుందని వాడుకొన్నాడు. దీనిలో మూడు ప్రధాన భావాలు వున్నాయి. సృష్టిలో క్రీస్తుపాత్ర, తిరుసభతో స్త్రీ సంబంధం, అతని మరణం