పుట:Puneetha Paul bodhalu 2.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ప్రేమ. వివాహ జీవితంలో ఈ ప్రేమవుంటే భర్త నియంతాకాడు, భార్య బానిసాకాదు.

కడన 6,1-4లో తల్లిదండ్రులు పిల్లల సంబంధాన్ని చెప్పాడు పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై యుండాలి. వారిని గౌరవించాలి. తల్లిదండ్రులు పిల్లల శక్తిసామర్థ్యాలను అణచివేయకూడదు. వారి కోపాన్ని రెచ్చగొట్టకూడదు. వారికి క్రమశిక్షణ, మతవిద్య నేర్పాలి. మామూలుగా పిల్లలకు తల్లిదండ్రుల కంటె ఎక్కువభక్తి రాదు.

6. తిరుసభ

ఈ జాబు తిరుసభను విపులంగా వర్ణిస్తుంది.

1. క్రీస్తు తన మరణం ద్వారా తిరుసభను స్థాపించాడు.
2. ఆ సభలో యూదులూ అన్యజాతివాళూ కూడ ఐక్యమౌతారు. -
క్రీస్తు ఈ వుభయజాతులకు మధ్యగల అడుగోడను పడగొట్టి దూరసులను సమిరాపసులను చేసాడు -213-14. ఇరువురి మద్య వైరాన్ని తొలగించాడు
- ఉభయులూ ఆత్మద్వారా తండ్రిని చేరతారు –2, 18
- అందరూ కలసి ఒకే దేవాలయం ఔతారు -2.22
- అందరూ కలసి సంపూర్ణక్రీస్తుగా ఎదుగుతారు.
3. క్రీస్తు తిరుసభలో వివిధ సేవలు నెలకొల్పాడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు ఈ సేవలు చేస్తారు 4, 11. ఈ సేవల ద్వారా తిరుసభ పెరుగుతుంది. క్రీస్తు పరిపూరుడు ఔతాడు-4,13.
4. తిరుసభ క్రీస్తు శరీరం, అతడు శిరస్సు. శరీరం వృద్ధిచెందే కొద్దీ క్రీస్తుకి పరిపూర్ణత వస్తుంది - 4,15-16.
5. తిరుసభ క్రీస్తు వధువు. అతడు ఆమెను వాక్యబోధ జ్ఞానస్నానం ద్వారా కడిగి శుద్ధిచేసాడు - 5,26-27.
6. వివాహ జీవితంలో భార్యాభర్తలు ఈ తిరుసభకీ క్రీస్తుకీ పోలికగా వుంటారు.