పుట:Puneetha Paul bodhalu 2.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21-24లో భార్యలను గూర్చి చెప్తున్నాడు. తిరుసభ క్రీస్తు దేహం. ఈ దేహానికి క్రీస్తు శిరస్సు. క్రీస్తు అధికారి. తిరుసభ క్రీస్తుకి లొంగివుంటుంది. వివాహంలో వరుడు క్రీస్తుకీ, వధువు తిరుసభకూ పోలికగావుంటారు. కనుక భార్య భర్తకు లొంగివుండాలి. కుటుంబంలో ఏక నాయకత్వం వుండాలి.

25-33లో భర్తలను గూర్చి చెప్తున్నాడు. పూర్వవేదంలో యావే వరుడు, యిస్రాయేులు అతని వధువు అనే భావం వుంది. నూత్నవేదంలో క్రీస్తు వరుడు, తిరుసభ అతని వధువు. క్రీస్తు తన వధువు కొరకు ప్రాణాలు అర్పించాడు. ఆ వధువుని వాక్య బోధతోను జ్ఞానస్నానంతోను శుద్ధిచేసాడు. ఆమెను తన యెదుట నిల్పుకొని ఆమెను చూచి ఆనందించాడు. యూదుల, గ్రీకుల వివాహాల్లో వధువుని స్నానం చేయించి అలంకరించి వరునిముందు నిల్పేవాళ్లు. క్రీను తిరునభ కొరకు ప్రాణాలు అర్పించి సిలువ విూద చనిపోయాడు. తిరుసభ క్రీస్తు దేహం. భార్య భర్త దేహం. క్రీస్తు తిరుసభను ప్రేమించనట్లే భర్త భార్యను ప్రేమించాలి.

పూర్వవేదంలో ఆదాము ఏవ ఏకవ్యక్తి అన్నటుగా ఐక్యమయ్యారు -2,24. ఈయైక్యత నూత్నవేదంలో క్రీస్తు తిరుసభల ఐక్యతను సూచిస్తుంది. ఈ యైక్యత వివాహంలో మళ్లా భార్యాభర్తల విూద సోకుతుంది.


భర్త భార్యవిూద అధికారం చలాయించకూడదు. ప్రేమ చూపాలి. ఇద్దరు ఏకవ్యక్తి అన్నట్లుగా కలిసమెలసి జీవించాలి. ఇద్దరికీ క్రీస్తు తిరుసభ ఆదర్శంకావాలి. గ్రీకు సంస్కృతిలో ప్రేమ రెండు రకాలు. భార్య శరీర సౌందర్యాన్ని చూచి ఆమెను ప్రేమించడాన్ని "ఈరోస్" అన్నారు. ఇక్కడ రచయిత ఉద్దేశించింది ఈ ప్రేమకాదు. ప్రేమించిన వ్యక్తి కొరకు ప్రాణాలు అర్పించడాన్ని "అగపె" అన్నారు. ఈ ప్రేమలో స్వార్థత్యాగం వుంటుంది. క్రీస్తు తిరుసభ పట్ల ఈలాంటి ప్రేమ చూపాడు. రచయిత భావం ప్రకారం, భర్త భార్యపట్ల చూపవలసింది