పుట:Puneetha Paul bodhalu 2.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందిరంగా భావించాడు. యోహాను సువిశేషంలో క్రీస్తే దేవాలయం. ఈ జాబులో క్రీస్తుతో కూడిన భక్త సమాజం దేవాలయం.

ఇంకా ఈ సంఘం దేవుని కుటుంబం. గ్రీకు రోమను ప్రజలకు కుటుంబం ఆయువుపటు. ఈ కుటుంబంలో తల్లిదండ్రులూ పిల్లలు బానిసలూ కలసిజీవించేవాళ్లు. ఈ పిల్లలు తల్లిదండ్రుల ఆస్తికి వారసులు అయ్యేవాళ్లు. ఈలాగే క్రైస్తవ సంఘం దేవుని కుటుంబం. క్రైస్తవులు క్రీస్తుద్వారా దేవుని బిడ్డలు. వీళ్లు తండ్రి ఆస్తియైన మోక్షానికి వారసులు ఔతారు.

4. విశ్వాసులు క్రీస్తుప్రేమను గ్రహించాలి 3,14-20

ఈ భాగం ప్రార్థనా రూపంలో వుంది. రచయిత విశ్వాసుల కొరకు ప్రార్ధన చేసున్నాడు. మొదట అందరు తండ్రులకు తండ్రియైన దేవునికి నమస్కారం చేస్తున్నాడు. అన్ని కుటుంబాలను కలగించింది తండ్రే. కనుక అతడు అందరికీ తండ్రి. కనుక ఆ తండ్రికి స్తుతి కలగాలి.

తర్వాత ప్రజలు క్రీస్తుపట్ల విశ్వాసంలో స్థిరత్వాన్ని పొందాలని వేడుకొంటున్నాడు. విశ్వాసంద్వారా క్రీస్తు వారి హృదయాల్లో వసించాలి. కుండనీటితో నిండి వున్నట్లుగా వారి మనస్సు క్రీస్తుతో నిండివుండాలి. క్రీస్తుకి వారిపట్ల వున్న ప్రేమ ఎంతగోప్పదో ఎంత విశాలమైనదో వాళ్లు అర్థంచేసి కోవాలి. ఆ దివ్యప్రేమ యెరూషలేము దేవాలయమంత, యెరూషలేము నగరమంత విశాలమైందని గ్రహించాలి. వాళ్లు దేవుని పూర్ణత్వంతో సంపూర్ణంగా నింపబడాలి. అనగా వాళ్లు పరిపూర్ణమైన దేవుని దైవత్వంలో పాలు పొందాలి.

5. భార్యాభర్తలు 5,21-33

ఈ పఠనం పెండ్లి పూజలో వస్తుంది. ఇది నూత్నవేదంలో ప్రధానమైన పెండ్లి వతనం. కనుక పవిత్రమైంది. పౌలు మొట్టమొదటనే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు విధేయులు కావాలని చెప్పాడు. ఇక్కడ విధేయుత అంటే ఒకరికొకరు సేవచేసికోవడం.