పుట:Puneetha Paul bodhalu 2.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిబంధనంలో పాలు లేదు. వాళ్లకు దేవుడు లేడు నిరీక్షణం లేదు. కాని ఇప్పడు క్రీస్తుని విశ్వసించి దూరసులు సమిరాపసులయ్యారు. గ్రీకు ప్రజలు కూడా రక్షణాన్ని పొందారు.

2. క్రీస్తుద్వారా యూదులూ అన్యులూ ఐక్యమయ్యారు 12,14-18

క్రీస్తు యూదులనూ అన్యులనూ ఏకంజేసే సమాధాన కర్త అయ్యాడు. యెరూషలేం దేవాలయంలో అడుగోడవుండేది. ఈగోడ దాటి అన్యులు దేవాలయం లోపలికి పోకూడదు. ఈ గోడ అన్యులను వేరు పరచింది. క్రీస్తు తన శరీరంద్వారా, అనగా తాను సిలువమివాద చనిపోవడం ద్వారా, ఈయడ్డు గోడను తొలగించాడు. ఈయడ్డు గోడ ధర్మశాస్త్రమే. క్రీస్తు ఈ ధర్మశాస్తాన్ని రదుచేసాడు. దానితో యూదులకీ అన్యజాతి వారికీ వున్న వైరం తొలగిపోయింది. పూర్వం యూదులు అన్యజాతివారిని అసహ్యించుకొని వారికి దూరంగా వుండే వాళ్లు. ఇప్పడు ఆ వైరంపోయి శాంతి నెలకొంది. క్రీస్తు మరణంతో ఉభయజాతులు దేవునితోను, తమలోతామూనూ ఐక్యమయ్యారు. క్రీస్తు తన బోధలద్వారా మరణంద్వారా అందరికీ సమాధానాన్ని చేకూర్చిపెట్టే సువార్తను బోధించాడు. అతడు శాంతి స్థాపకుడు. సిలువమరణంద్వారా శాంతి చేసినవాడు. ఇప్పడు ఉభయుజాతులు ఆ క్రీసుద్వారా ఆత్మయుందు తండ్రిని చేరగలుతున్నారు.

3. తిరుసభ దైవారాధన జరిగే దేవాలయం 2,19-22

ఒక పవిత్ర దేవాలయం వుంది. దానికి అపోస్తలులూ ప్రవక్తలూ పునాది. క్రీస్తు మూలరాయి. అన్యజాతి ప్రజలు ఈ మందిర నిర్మాణంలో శిలలు. అందరూ కలసి ఈ పవిత్ర దేవాలయం ఔతారు. దానిలో దేవుడు ఆత్మద్వారా వసిస్తాడు. ఈ దేవాలయం తిరుసబే. ఈ తిరునభలో తండ్రికి ఆరాధన జరుగుతుంది.

యూదుల్లో ఎస్సీనులు అనే ఒక వర్గం ప్రజలు వుండేవాళ్లు. వీళ్లు తామే దేవుని మందిరం అనుకొన్నారు. మన రచయిత యూదులతోను అన్యులతోను కూడిన తిరునభను దేవుని