పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1992లో రాజీవ్‌గాందీ మరణించడంతో కేంద్రంలో పి.వి. నర్సింహ్మరావు ప్రధానమంత్రి అయ్యిండు. దీంతో తెలంగాణ కాంగ్రేసు నాయకుళ్తో కొత్త ఉత్సాహం నిండింది. తెలంగాణ (ప్రాంత అభివృద్దిని కోరుకుంటు 1992లో జానారెడ్డి తెలంగాణ ఫోరం కన్వీనర్‌గ పి.వి.కి వినతిపత్రం ఇచ్చి, సంతోషపడ్డడు. అయితే పి.వి. నర్సింహ్మరావుకు ప్రధాని పదవిని పదిలపరుచుకోవడానికే ఉన్న పుణ్యకాలం సరిపోయింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రుల మార్చు గందరగోళ పరిస్థితులకు దారితీసింది. కాంగ్రేసు అంతర్జ్గంత కలహాల పుణ్యమాని ఎన్ని ఏశాలేసినా ఎన్‌.టి.ఆరే ముఖ్యమంత్రి అయ్యిండు. 1994 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ పతాకాన్ని ఎగరేసింది. సహకార రుణాల మాఫీ, 60డు రూపాలయలకే కిలో బియ్యం వంటి ఆకర్షణీయమైన పథకాలతో విజయఢంకా మోగించింది. ఇంతలో లక్ష్మీపార్వతి రామారావు జీవితంలోకి అడుగుపెట్టింది. దీంతో కుటుంబ తగాదాలు ఎక్కువైనయ్‌. ఇంటి పోరు భరించలేక 1995 ఆగష్టు 80న రాజీనామ చెసిండు.

ఎన్‌.టి.రామారావు మీద తిరుగుబాటు చేసి విజయం సాధించిన చంద్రబాబు నాయుడు 1995 సెష్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వేకారం చేసిండు. రాజకీయ ్రత్యర్థులందరిని దూరం చేసిండు.

చంద్రబాబు ప్రభుత్వం పన్నులను విపరీతంగ పెంచి ప్రజలమీద మోయలేని ఖారం మోపింది. విజన్‌ 2020 పేరుతో చంద్రబాబు గారడి చేసిండు. అప్పులు పెరిగి అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ని స్వర్ణాంధ్రగ మార్చుతనని మాయమాటలు చెప్పిండు. చంద్రబాబు హైటెక్‌ సినిమాని చూపించిండు. అప్పుచెసి కొప్పు పెట్టగల నేర్చరితనంతో ప్రతిది (ప్రైవేట్‌ పరం చేసిండు. విద్యను సామాన్యునికి అందని ద్రాక్షగా మార్చిండు. చంద్రబాబు ఎరజూపిన పదవుల ఆశతో తెలంగాణ తెలుగుదేశం ఎం.ఎల్‌. ఏలు ఏనాడు నోరు తెరిచేవాళ్ళు కాదు. తెలంగాణ దోపిడి, వివక్షకు గురైతుందని తెలిసికూడ ఒక్కరంటే ఒక్కరు ప్రతిఘటించిన పాపాన పోలేదు. కాని 1996 నాటికి తెలంగాణ మేథావులు, కవులు, కళాకారులు ప్రతేక్యక తెలంగాణ రాష్ట్రం కోసం (ప్రయత్నాలు మొదలు పెట్టిండ్రు.

తెలంగాణ ఉద్యమంతో పొంచిఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన చంద్రబాబు నాయుడు 610 జిఓ. మీద మరింత జాష్యం చేయడం కోసం గిర్‌గ్లాని (ఏకసభ్య) కమిటీని నియమించి 90 రోజుల్లో నివేదిక సమర్పించాలని అడేశించిండు. 204 ప్రభుత్వత శాఖలకు గాను కేవలం 52 శాఖల సమాచారం మాత్రమే బయటికి తీయగలిగిండు. మిగతా 152 శాఖలు గిర్‌గ్గానికి కనీసం సహకరించలేదు. ఈ అంబటి వెంకన్న * 27