పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగుదేశం ఎప్పుడు తెలంగాణది కాదు

మార్చి 23, 1982లో ఎన్‌.టి.రామారావు కొంతమంది కాంగ్రేసు నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీని న్థాపెంచిండు. 1988 జనవరి 9న రామారావు ముఖ్యమంత్రి అయ్యిండు. ఎన్‌.జి.ఓ.ల గోస చూసిన రామారావు కంటితుడుపు చర్యగ 1984లో జైభారత్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని నియమించిండు. ఏడాది లోపల నివేదిక సమర్పించిన ఈ కమిటి 1975-1985 మథ్య కాలంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్దంగ తెలంగాణలో 59వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు నివేదికను సమర్శించింది. దీంతో రామారావు సుందరేశన్‌తో ఏకసభ్య కమిటీని నియమించిండు. ఈయన సిఫార్సుల మేరకు 610 జి.ఓ.ని జారి చేసిండు. ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదంతో ఉపన్యాసాలతో ఊదరగొట్టి తెలంగాణని ఆగం చేసిండు. తెలంగాణ (ప్రాంతీయ మండలిని రద్దు చేసిండు. ఆస్థానకవి పదవి నుంచి దాశరథిని తొలగించిండు. ట్యాంక్‌బండ్‌ మీద ఆంధ్రుల విగ్రహాలు ప్రతిష్టించిండు. శ్రీశ్రీ విగ్రహాన్ని పెట్టి ఆనందించిండు. తెలంగాణ మీద మొసలి కన్నీళ్ళు కార్చి 610 జి.ఓ.తో చేతులు డులుపుకుండు. తెలంగాణ విషయంలో ఆంధ్ర పాలకులు జి.ఓ.లు చేసేది కేవలం కాలయాపనకే అని రామారావు నిరూపించిండు. నీళ్ళు, నిధలు, ఉద్యోగాలలో తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టిండు. 1984 ఆగష్టు 16న రామారావు నిరంకుశత్వాన్ని ఎదిరించి నాదెండ్ల భాస్మర్‌ రావు ముఖ్యమంత్రి అయ్యిండు. రామారావు చేసిన తప్పుల్ని కొన్నింటిని సరిదిద్ది సెప్టెంబర్‌ 16న అనేక వత్తిళ్ళకు తలొగ్గి రాజీనామ చేసిండు.

1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎన్‌.టి.ఆర్‌ మళ్ళీ విజయం సాధించిండు. చంద్రబాబు నాయుడికి పార్టీ కార్యదర్శి పదవిని ఇచ్చిండు. ముఖ్యమంత్రిగా ఉండి విశ్వామిత్ర సినిమాలో నటించిండు. గొప్ప పరిపాలన దక్షుడనుకున్న ఎన్‌.టి.రామారావు పరాశ్మాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించిండు.

1989లో టి.డి.పి ఓడిపోయి, కాంగ్రేసు విజయం సాధించడంతో మరి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యిండు. అనేక విధాల అసమ్మతిని రగిల్చిన నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి చెన్నారెడ్డిని దించి 1990లో ముఖ్యమంత్రి అయ్యిండు. రెండేండ్లు నిండక ముండే అసమ్మతి వాదులు జనార్ధన్‌ రెద్దిని గద్దెదించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా 1992లో కోట్ల విజయభాస్మర్‌రెడ్డి నామినేట్‌ చేయబడిండు. రాష్ట్ర కాంగ్రేసు రాజకీయాలు అస్తవ్యస్తంగ ఉన్న ఈ సమయంలో, 26 * ప్రత్వేక తెలంగాణ ఉద్యమం