పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెట్టిండ్రు. “జై ఆంద్ర” అంటూ మంత్రులు రాజీనామ చేసిండ్రు. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసిండ్రు. 1978 జనవరి నుంచి 1978 డిసెంబర్‌ 10 వరకు దాదాపు 320 రోజులు రాష్ట్రపతి పాలనను కొనసాగంచిండ్రు. ఈ సమయంలోనే ఆరుసూత్రాల పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణని తెర్లుతెర్లు జేసిండ్రు. తర్వాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యిండు. మర్రి చెన్నారెడ్డి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గ వెళ్ళిపోయిండు.

1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగ ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించిందని ఎంత గొప్పగ చెప్పినప్పటికి, ఆ తర్వాత ఈ దేశంలో 1960లో బొంబాయి, 1966లో పంజాబు రాష్ట్రాలు భాషా ప్రయుక్త సూత్రం ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించబడినయి. అయితే మర్రి చెన్నారెడ్డి కాలంలో బలమైన తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటకి ఇందిరాగాంధీ ఉద్యమాన్ని అణిచివేయాలని సంకల్సించింది.

దేశంలో జరిగిన అనేక పరిణామాల వల్ల 1977లో కాంగ్రేసు ఓడిపోయింది. ఇందిరాగాంధిని కాంగ్రేసు నుంచి బహిష్మరించిండంతో కాంగ్రేస్‌ -ఐ పేరుతో పార్టీని స్థాపించింది. చెన్నారెడ్డి గవర్నర్‌ పదవికి రాజీనామ చేసి కాంగ్రేస్‌-ఐ సారధ్యం తీసుకుండు. 1978 మార్చిలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధి విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో త్త పార్లమెంట్‌ స్థానాలకు గాను మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో 41 స్థానాలు గెలిచిండ్రు. కేంద్ర మంత్రివర్గంలో మొదటి సారి తెలంగాణ వ్యక్తులు పి.వి.నర్సింహ్మారావు, శివశంకర్‌లకు మంత్రి పదవుల వచ్చినయి. మెదక్‌ నుంచి గెలిచిన ఇందిరాగాంధి ప్రధానమంత్రి అయ్యింది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా నూతనంగ రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసిండు. జోనల్‌ పద్దతిని తీసుకొచ్చిండు. దీంతో మింగుడు పడని ఆంధ్రులు రాష్ట్రంలో అశాంతిని రగిల్చిండ్రు. అసమ్మతిని తట్టుకోలేక రాజీనామ చేయడంతో టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. అతిపెద్ద మంత్రివర్షాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 11 సంవత్సరాలకు పంచాయతి ఎన్నికలు జరిపించిన ఘనత సొంతం చేసుకుండు. టంగుటూరి అంజయ్య 1982 ఫిబ్రవరిలో రాజీనామ చేయడంతో అనూహ్యంగ అధిష్టానం భవనం వెంకట్రామిరెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే భవనాన్ని దింపి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిండ్రు. 1982 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రేసు ఓడిపోయి ఎన్‌.టి. రామారావు స్టాపించిన టి.డి.పి అధికారంలోకి వచ్చింది.

అంబటి వెంకన్న * 25