పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పదవిని అలంకరించిన మరుక్షణమే ఉపముఖ్యమంత్రి పదవికి మంగళం పాడిండు. ఒప్పందాన్ని ఆదిలోనే తుంగలో తొక్కిండు. తెలంగాణలో రగులుకుంటున్న నిరసన సెగలను చల్లార్చడానికి 1960లో తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఆ సంఘానికి తొలి అధ్యక్షునిగ ౩ె.అచ్యుతంెడ్డి బాధ్యతలు చేపట్టిండు. 1960లో మొదటి హరిజన ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్యను 1962 మార్చిలో అజ్ఞాతంలోకి పంపి నీలం నంజీవరెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యిండు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రిగ కొండా వెంకట రంగారెడ్డిని నియమించిండు. సంజీవరెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవిని మళ్ళీ రద్దు చేసిండు. 1964లో కాసుబ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ ప్రాంతీయ సంఘానికి రెండవ అధ్యక్షుడిగా హాయగ్రీవాచారి నియమించబడిండు. తెలంగాణ సమస్యలను ఎన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకపోయిన ఫలితం లేకుండ పోయింది.

విశాలాంధ్రలో ప్రజారాజ్యాన్ని కలలుగన్న కమ్యునిస్టు నాయకులు అనేక కుట్రలతో విశాలాంధ్రని సాధించిండ్రు. కుట్రలు ఒక్కటొక్కటిగ బయటికొచ్చి తట్టుకోలేక 1964 ఏప్రిల్‌ 11న కమ్యునిస్టు పార్టీ రెండుగ చీలి పోయింది.

కాసు బ్రహ్మానందరెడ్డి తిరిగి 1967 ఎన్నికలలో గెలిచి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యిండు. కాని ఇదే సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బూర్గుల రామకృష్ణారావు సికింద్రాబాద్‌ సీట్‌ అడిగినప్పటికి ఇవ్వకుండ అవమానించిండడ్రు. ఆ తర్వాత ఆయన కొంత కాలం కేరళ గవర్నర్‌గ పనిచేసి, తన రాజకీయ జీవితానికి స్వస్తి పలికిండు. 1969 తెలంగాణ ఉద్యమ ఫలితంగ కాసు 1971లో రాజినామా చేయడంతో, 1971 సెప్టెంబర్‌ 80న పి.వి. నర్సింహ్మారావు ముఖ్యమంత్రి అయ్యిండు.

1972 ఎన్నికలలో గెలిచిన కాంగ్రేసు మళ్ళీ పి.వి. నర్సిం్మారావునే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది. అయితే 1972 మేలో తెలంగాణలో భూములను అన్యాక్రాంతం చేయడాన్ని నిషేదిస్తూ ఆర్జినెన్సును తీసుకొచ్చిండు. దీంతో సీమాంధ్ర నాయకుల్లో కొంత అలజడి రేగింది. అంతకుముందే 1970లో ముల్కీ రూల్సు చెల్లుబాటు అయితయని చెప్పిన హైకోర్టు తీర్పును సవాలు చేసిండ్రు. ఈ పరిణామంతో 1972లో ముల్కీరూల్స్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్చు చెప్పింది. ఆ సమయంలో పి.వి. నర్సింహ్మరావు తెలంగాణకు న్యాయం చేయాలని అనేక విధాలుగ ప్రయత్నం చేసిండు. ఇది భరించలేని ఆంధ్రులు ఏకంగ పి.వి. ముఖ్యమంత్రి పదవికే ఎసరు

24 * ప్రత్యేక తెలంగాణ ఉద్యమం