పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రభుత్వ ఉద్యోగాలలో ముల్మీలనే నియమించాలని ఫర్మాన జారి చేసిండు. ఈ ఫర్మాన ప్రకారం హైద్రాబాద్‌లో జన్మించిన వాళ్ళు మాత్రమే ముల్మీలు.

అయితే దాదాపు 40శాతానికి పైగా భూమి జాగీర్జార్డు దేశముఖ్‌లు, మళ్లేదార్హు, పాయెగాళ్ళు చిన్న చిన్న సంస్థానాధీశులుగా నిరంకుశంగ వ్యవహరించేవాళ్ళు. భూస్వాములు తమ స్వంత వ్యవసాయంతో పాటు అత్యధిక భూమిని కౌలుకిచ్చి సాగు చేయించేవాళ్ళు. ఈ పద్దతి వల్ల క్రమంగ వెట్టిచాకిరి వ్యవస్థ అవతరించింది. వృత్తిదారులను చిన్నచూపు చూసి చిత్రహింసలకు గురిచేసేవాళ్ళు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా జనగామ తాలూకాలో విసునూరు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి లాంటి పెద్ద భూస్వాములు ప్రజలను చిత్రహింసలు పెట్టిండు. లెక్కకు మించిన పన్నులు విధించి అక్రమంగ లెవీ ధాన్యాన్ని వసూలు చేసిండ్రు.

దేశముఖ్‌ల, భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించడం కోసం ఆంధ్రమహాసభ ప్రజల్లో చైతన్యాన్ని తీసకురావాలని అనేక ప్రయత్సాలు చేసింది. సభలు సమావేశాలు నిర్వహించింది. కరపత్రాలు ముద్రించి కార్యకర్తలను తయారు చేసింది. గ్రామ గ్రామాన కమిటీలు ఏర్పాటు చేసి దాదాపు 10వేల మంది కార్యకర్తలతో పెద్ద సైన్యంగా తయారయ్యింది. విసునూరు, కడవెండి దేవరుప్పల, మొండ్రాయి వంటి గ్రామాలలో నిరంతరం సభలు జరుపుతూ ప్రజల్లో చైతన్యం కలిగించింది. ముఖ్యంగ 1944లో జరిగిన భువనగిరి నిజాం రాక్ష్రాంధ్ర మహాసభ నాటికి ప్రజలు దేశముఖ్‌ల దౌర్జన్యాలను ఎదుర్శొనే విధంగ పరిస్థితి తయారయ్యింది.

దేశముఖ్‌లు అక్రమంగ వసూలు చేస్తున్న లెవీ ధాన్యాన్ని ఆంధ్రమహా సభ అడ్దుకుంది. దీంతో విసునూరు దొర కుట్రపన్ని కడవెండిలో తన గూండాలతో దాడికి స్పిమయ్యిండు. కడవెండి ఊరు ఊరంత ఒక్కటె సంఘటనా స్థలానికి పెద్ద ర్యాలిగా వస్తున్న సంధర్బంలో అగ్గిపిడుగై గర్జిస్తున్న దొడ్డి కొమురయ్య దొర గూండాలు జరిపిన కాల్బుల్లో మరణించిండు. ఆ సంఘటనతో ఉద్యమం సాయుధపోరాట రూపంగ మారింది. దొరలు భూస్వాములను జనం ఉరికిచ్చి కొట్టిండ్రు. దిక్కుతోయని భూస్వాములు దేశముఖ్‌లు రజాకార్ల చెంతకు చేరిండ్రు. ఖాశీంరజ్వీ ఏర్పాటు చేసిన రజాకార్‌ సేనను వెంట బెట్టుకొని విసునూరు రామచంద్రారెడ్డి కొడుకు బాబుదొర అనేక అఘాయిత్యాలకు పాల్చడ్డడు. ఊర్లకు ఊర్లే తగలబెట్టిండు. ఎందరినో చంపేసిండు. ఈ విధంగ కమ్యునిస్టులు రజాకార్లు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమయ్యిండ్రు.

అంబటి వెంకన్న * 13