పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


86. పూడికబావిలో యిర్మీయా - యిరీ 38,1-18 సిదియా రాజు కాలంలో యిర్మీయా చెరలో వున్నాడు. అప్పడు బాబిలోనీయులు యెరూషలేము నగరాన్ని ముట్టడిస్తున్నారు. యిర్మీయా మీరు బాబిలోనియా రాజుకి లొంగిపొండి. లేకపోతే యుద్ధం, ఆకలి, అంటురోగాల వలన నాశమైపోతారు అని చెప్పాడు. అతని పలుకులు అధికారులకు నచ్చలేదు. ఇతడు బాబిలోనీయుల పక్షాన జేరి మన ప్రజలను నిరుత్సాహ పరుస్తున్నాడు అని రాజుకి ఫిర్యాదు చేశారు. ప్రవక్తనుచెరనుండి కొనిపోయి పూడిక బావిలోకి దింపారు. అప్పడు నగరంలో ఆహారంలేదు. ప్రవక్త ఆ బావిలోనే ఆకటితో చనిపోయేవాడే. రాజప్రాసాదంలో పనిజేసే ఏబెద్మేలెకు అనే నీగ్రో బానిస యిర్మీయా మీద దయగలిగి అతనికి త్రాళ్లు ప్రాత గుడ్డలు అందించాడు. ప్రవక్త ఆ గుడ్డలను చంకలక్రింద పెట్టుకోగా త్రాళ్లతో అతన్ని వెలుపలికి లాగారు. 87. యెహెజ్కేలు ప్రభువు వాక్కుని భుజించడం - యోమో 28-3, 4 దేవుడు యెహెజ్మేలుని ప్రవక్తగా ఎన్నుకొన్నాడు. అతనికి దర్శనం కలిగింది. ఒక చేయి అతనికి పుస్తకపు చుట్టను అందించింది. దేవుడు నీవు దీన్ని భుజించు అని చెప్పాడు. ప్రవక్త దాన్ని తినగా అది అతని నోటికి తేనెలగ తీయగా వుంది. నీవు ఈ సందేశాన్ని భుజించావు కదా! ఇక వెళ్లి ప్రజలతో మాటలాడు అని దేవుడు చెప్పాడు. ప్రవక్త మొదట దేవుని వాక్కుని విని తర్వాత దాన్ని ప్రజలకు తెలియజేస్తాడని ఈ దర్శనం భావం. యెహెజ్కేలు ఈ దర్శనం వలన ప్రబోధం చెంది ప్రజలకు ప్రభువు పలుకులు విన్పించాడు. 88. నెబుకద్నెసరు కల - దాని 2 యిస్రాయేలు బాలురైన దానియేలు, హనన్యా, మిషాయేలు, G)