పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు84. హిస్కియా ప్రార్ధనం - dమెష 37 అస్సిరియా రాజు సనైరీబు యూదియా మీదికి దండెత్తాడు. హిస్మియా రాజుకి జాబు పంపాడు. అందులో మా పూర్వులు నేను చాల రాజ్యాలను జయించాం. ఆరాజ్యపు దేవుళ్లు వాటిని మా నుండి కాపాడలేక పోయారు. ఇప్పడు నీ దేవుడు మాత్రం నిన్ను నా బారి నుండి ఏలా రక్షిస్తాడు? కనుక నీవు నాకు లొంగిపో అని వ్రాసివుంది. హిస్మియా రాజు దేవాలయం ప్రవేశించి జాబుని దేవుని సన్నిధిలో విప్పిపెట్టి భక్తితో దేవునికి ప్రార్థన చేశాడు. అస్సిరియా రాజునుండి నన్ను కాపాడు అని మనవి చేశాడు. ఈ సంగతి విని యెషయా రాజు వద్దకు మనిషిని పంపి దేవుడు నీ మొర విన్నాడు. నీవు భయపడవద్దు. సన్డెర్రీబు ఈ పట్టణంలో ప్రవేశించలేడు. అతడు తాను వచ్చిన దారినే తిరిగిపోతాడు అని సందేశం చెప్పించాడు. ఆ రాత్రే దేవదూత అస్సిరియా సైన్యంలో లక్షమైనభై యైదు వేలమందిని చంపివేశాడు. దానితో గుండె చెదరి సన్డెర్రీబు ముట్టడిని ఆపివేసి అస్సిరియాకు తిరిగిపోయాడు. అక్కడ ఆ రాజు దేవాలయంలో తన దేవుణ్ణి ఆరాధిస్తుండగా కుమారులే అతన్ని చంపివేశారు. 85. యిర్మీయాకు పిలుపు - యిర్మీ 1,4-10 ప్రభువు యిర్మీయాను తన సేవకు పిల్చాడు. నీవు తల్లి కడుపున పడకమునుపే నేను నిన్ను ఎన్నుకొని జాతులకు ప్రవక్తగా నియమించాను అని చెప్పాడు. ఆ రోజుల్లో ప్రజలు ప్రవక్తల పలుకులు వినేవాళ్లు కాదు. కనుక యిర్మీయా దడిశాడు. నేను పసివాణ్ణి. ప్రవక్తగా పనిచేయలేను అని వెనుకాడాడు. కాని ప్రభువు అతన్ని ప్రోత్సహించి అభయమిచ్చాడు. నేను నీకు తోడుగా వుండి నీకు విజయాన్ని ప్రసాదిస్తాను అని చెప్పాడు. తన వాక్కు నెత్తి అతని నోటితో పెట్టాడు. నీవు ప్రజలను భవనంలాగ పడగొట్టి మళ్లా కడతావు అని చెప్పాడు. ఈ దర్శనంలోనే యిర్మీయా ప్రవక్తయై ప్రభువు సందేశాన్ని చెప్పడం మొన్క్రియ