పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేడుకొన్నారు. దేవుడు ఆ జనం మీద జాలి చెంది వారిని శిక్షించకుండ వదిలివేశాడు. కాని వాళ్లు ఆలా శిక్షను తప్పించుకోవడం యోనాకు ఇష్టంలేదు. పట్టణం నాశంగావాలనే అతని కోరిక. అతడు నీ వెప్పడూ ఈలాగే దయతో పాపులను శిక్షించక వదలి వేస్తుంటావులే అని దేవునికి పిర్యాదు చేశాడు. దేవుడు నీ కోపాన్ని అణచుకో అని చెప్పాడు. యోనా ఆగ్రహంతో నీనివేకు దూరంగా వెళ్లిపోయి ఓ గుడిసె వేసికొని, ఒకవేళ పట్టణం నాశమైపోతుందేమో చూద్దామని దానిలో కూర్చున్నాడు. దేవుడు ఎండలో యోనాకు నీడనీయడానికి ఓ సౌర తీగను మొలపింపగా అతడు ఎంతో సంతోషించాడు. కాని మరుసటిరోజు ఓ పురుగు దాన్ని కొట్టివేసింది. ఇక నీడ లేదు. ప్రవక్త ఎండ తీవ్రతను భరించలేక నేను చావడమే మేలు అని ఆపసోపాలు పడ్డాడు. అప్పడు దేవుడు ఓయి! నీవు ఒక తీగ పోయినందుకే ఇంతగా విచారిస్తున్నావు. నీ మట్టుకు నీవు ఈ తీగను నాటలేదు, పెంచలేదు. ఈ పట్టణంలో లక్షా యిరవేలమంది జనం ఉన్నారు, ఇంకా లెక్కలేనన్ని జంతువులున్నాయి. ఈ ప్రాణులన్నీ నాశమైపోతే నాకు బాధ కలగదా అన్నాడు. దేవుడు కరుణగల వాడనీ, ఒక్క యూదులనేగాక అన్యజాతి వారిని గూడ రక్షించేవాడనీ ఈ కథ భావం. 82. ఉజ్జీయా గర్వం - 2రాజుల దినచర్య 26, 16-23 ఉజ్జీయా గొప్ప రాజు. అతడు యుద్ధంలో చాల విజయాలు సాధించి పేరు తెచ్చుకొన్నాడు. మారణయంత్రాలు కూడ కనిపెట్టి తెలివైన రాజు అనిపించుకొన్నాడు. దానితో అతనికి గర్వం పట్టుకొంది. దేవళంలో సాంబ్రాణి పొగ వేయడం యాజకుల పని. ఐనా ఆ రాజు పొగరుతో దేవళంలోకి వెళ్లి తానే దేవుని ముందు ధూపం వేశాడు. ఎనభైమంది GD