పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మనవి మాట

ప్రాత నిబంధన కథలు చాల వున్నాయి. ఈ పుస్తకంలో ముఖ్యమైన కథలు 108 మాత్రం పేర్కొన్నాం. కథలను సంగ్రహంగా వ్రాశాం.

ఈ గ్రంథం హైస్కూలు విద్యార్థులకు ఉద్దేశింపబడింది. పెద్దవాళ్లను ప్రోగుజేసి బైబులు బోధించడం అంత తేలికకాదు. పిల్లలు ఎప్పుడూ మన స్కూళ్లల్లో, హాస్టళ్లల్లో సులువగానే దొరకుతారు. వాళ్లకు చిన్నప్పుడే ఈ కథలను బోధిస్తే కొంతవరకైనా బైబులు జ్ఞానం పట్టుపడుతుంది. ఈ వద్దేశంతోనే ఈ పుస్తకాన్ని తయారు చేశాం.

ప్రతి కథకు ఆలోకనం ఇచ్చాం. ఈ కథలను బోధించే ఉపాధ్యా యులు బైబులునుండి ఆలోకనాలను నేరుగా చదివి విన్పిస్తే మంచి ఫలితం కలుగుతుంది. కథలను కొద్దిగా పెంచి బోధించాలి.

బైబులు కథల్లో లోతైన భావాలు, గొప్ప నీతులు దాగి వుంటాయి. ఉపాధ్యాయులు ఈ యంశాలను విద్యార్థులకు కొంచం వివరించి చెప్పాలి. బైబులు మన ప్రవర్తనను తీర్చి దిద్దే గ్రంథం.

మన క్యాతలిక్ సమాజంలో బైబులు పరిజ్ఞానాన్ని పెంచడానికి ఈ పుస్తకం ఎంతోకొంత తోడ్డుడుతుందని ఆశిస్తున్నాం.

- గ్రంథకర్త