పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెల్లడి చేసింది. రాజు కోపించి హామానుకి ఉరిశిక్ష విధించాడు. మొర్డెకయికి తయారు చేసిన స్తంభం మీదనే అతన్ని వురి తీశారు. ఎస్తేరు రెండవసారి రాజు సన్నిధిలోకి పోయి యూదులు తమ్మ చంపడానికి వచ్చిన వారిని తామే చంపడానికి అనుమతి పొందింది. కనుక శత్రువులకు మారుగా యూదులే శత్రువులను చంపారు. ఈ సంఘటనను జ్ఞాపకముంచుకోవడానికి పూరీము ఉత్సవాన్ని ఏర్పాటు జేసి దాన్ని ఏటేట జరుపుకోవాలని నిర్ణయించారు. ఎస్తేరు తన జాతిని కాపాడిన ధీరవనిత. 96. రెండవ దేవాలయ నిర్మాణం -హగ్గయి 1 చాలమంది యూదులు బాబిలోనియా ప్రవాసం నుండి తిరిగి వచ్చారు. దర్యావేషు రాజు రెండవ దేవాలయాన్ని కట్టడానికి అనుమతి నిచ్చాడు. దేవుడు హగ్గయి ప్రవక్తను ప్రేరేపించాడు. అతడు ప్రభువు మందిరం శథిలమై యుండగా మీరు చక్కని యిండ్లల్లో వసిస్తున్నారు.మీరు దేవాలయాన్ని పట్టిచుకోవడం లేదు. కనుక మీకు తిండి, ಬಟ್ಜಲು చాలినంతగా లభించడం లేదు. కొండల్లోకి వెళ్లి కలపను నరుకుకొని వచ్చి దేవాలయాన్ని పునర్ని ర్మించండి అని జనులను హెచ్చరించాడు. అప్పడు సెరుబ్బాబెల్ అనే రాష్ట పాలకుడు, యోషువా అనే యాజకుడు ప్రజలకు నాయకత్వం వహిస్తున్నారు. అందరూ కలసి క్రీ.పూ.515లో రెండవ దేవాలయాన్ని కట్టి ముగించారు. ఇది సొలో మోను దేవాలయమంత గొప్పదికాదు. క్రీస్తునాడు ఉన్నది ఈ రెండవ దేవాలయమే. 97. నెహెమ్యాప్రాకారం కట్టడం నెహెమ్యా పర్షియా రాజు అర్తహషస్త ఆస్థానంలో పెద్ద ఉద్యోగి. అతడు రాజు అనుమతిని పొంది ప్రవాసం నుండి యూదియాకు తిరిగి వచ్చాడు. అప్పటికే నగర ప్రాకారాలు, ద్వారాలు నాశమయ్యాయి. అతడు ప్రాకారాన్ని తిరిగి నిర్మింపగోరాడు. కాని స్థానిక జాతులవాళ్లు అడ్డు వచ్చారు. GD