పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సౌలు శత్రువులకు దడిసి తొందరపాటుతో దహనబలిని తానే సమర్పిం చాడు. కాని అతడు యాజకుడు కాదు. బలి ముగిశాక సమూలు వచ్చి కోపించాడు. నీవు దేవుని ఆజ్ఞ మీరావు కనుక నీకు బదులుగా మరొకడు రాజవుతాడని చెప్పాడు -1సమూ 13,7-14

సౌలు అమాలెకీయులతో యుద్ధం జేస్తున్నాడు. కాని యుద్ధంలో గెల్చాక వారి రాజైన అగాగును చంపివేయలేదు. వారి జంతువులను శాపం పాలుచేసి వధించలేదు. సౌలు అతని అనుచరులు మేలైన పశువులను తామే దక్కించుకొన్నారు. ఈ కార్యాలు ప్రభువు ఆజ్ఞకు విరుద్ధం. కనుక సమూవేలు కోపించి నీవు యావే ఆజ్ఞలు త్రోసి వేశావు గనుక ప్రభువు నిన్ను రాచరికం నుండి త్రోసివేశాడు అని చెప్పాడు -1సమూ 15. ఈలా అవిధేయతవల్ల సౌలు రాజు రాజపదవిని కోల్పోయాడు.

48. రెండవరాజుగా దావీదుకి అభిషేకం - 1సమూ 16,1-13

ప్రభువు సమూవేలుతో నీవు బేల్లెహేము వెళ్లి యీషాయి కుమారుల్లో వొక రెండవరాజుగా అభిషేకించు అని చెప్పాడు. యీషాయి తన పెద్దకొడుకు ఎలీయాబును ప్రవక్త యెదుటికి కొనివచ్చాడు. అతని ఆకారం బాగా వుంది. పైగా జ్యేష్టుడు. కనుక ప్రవక్త దేవుడు ఇతన్నే యెన్నుకొని వుండాలి అనుకొన్నాడు. కాని దేవుడు నరుని రూపాన్నిగాక హృదయాన్ని గమనించేవాడు. అతడు ఎలీయాబును ఎన్నుకోలేదు. తర్వాత తండ్రి మిగిలిన ఆరురు కుమారులను గూడ ప్రవక్త యెదుటికి కొని వచ్చాడు గాని దేవుడు వారిలో ఎవ్వరిని ఎన్నుకోలేదు. ప్రవక్త వచ్చినప్పడు దావీదు ఇంటిపట్టున గూడ లేడు. పొలంలో గొర్రెలు కాచుకొంటున్నాడు. తండ్రి అతన్ని పిలువనంపాడు. దావీదు రాగానే ప్రభువు ప్రవక్తకు ఇతన్ని అభిషేకించు అని చెప్పాడు. సమూవేలు అన్నల యెదుట ఒలీవతైలంతో దావీదుకి అభిషేకం చేశాడు. ఆనాటినుండి దేవుని ఆత్మ అతన్ని ఆవేశించి యుద్ధ వీరుణ్ణిగా తయారుచేసింది. ఏడ్గురు అన్నలను కాదని దేవుడు