పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈషాయి కుమారుడే దావీదు. కనుక దావీదుకి రూతు ముత్తవ్వ సంతానం కలిగి తమ కుటుంబం నశించకుండా వుండడానికిగాను అత్తాకోడళ్లు ఈలా తిప్పలు పడ్డారు. రూతు కథ పుణ్యస్త్రీ కథ.

45. అన్నా బిడ్డడి కొరకు వేడుకోవడం - 1సమూ 1-2

ఎల్మనాకు అన్నా, పెనిన్నా అని యిద్దరు భార్యలు. పెనిన్నాకు బిడ్డలు కలిగారుగాని అన్నా గొడ్రాలుగా వుండిపోయింది. సవతి నీకు పిల్లలు లేరుకదా అని అన్నాను దెప్పిపొడిచేది. ఆమె పిల్లలకొరకు తపించిపోయేది. ఒకసారి కుటుంబమంతా షిలో దేవాలయానికి యాత్ర వెళ్లింది. అన్నా దేవుని సన్నిధిలోకి వెళ్లి ప్రభూ! నా మనవి ఆలించు. నీవు నాకొక మగబిడ్డ ప్రసాదించావంటే వాణ్ణి జీవితాంతం నీ సేవకే సమర్పిస్తాను అని మొక్కుకొంది.

ప్రార్థనలో అన్నా పెదవులు కదులుతున్నాయిగాని నోట మాటలేదు. దేవళంలో పరిచర్యజేసే పెద్దగురువు ఏలీ ఆమె తప్పతాగి వచ్చిందనుకొని మందలించాడు. అన్నా అయ్యా! నేను త్రాగిరాలేదు. తీరని బాధలో వుండి దేవునికి మనవి చేసికొంటున్నాను అని చెప్పింది. అతడు ఆలాగైతే దేవుడు నీ మొర ఆలిస్తాడు. ప్రశాంతంగా పోయిరా అని ఆమెను దీవించాడు. అన్నా యింటికి వెళ్లాక గర్భం దాల్చి బిడ్డ కని సమూవేలు అని పేరుపెట్టింది. శిశువుకి పాలు మాన్పించిన తర్వాత దేవాలయానికి తీసికొని వచ్చి ప్రభువుకి సమర్పించింది. అతడు దేవాలయంలోనే వుండిపోయి యాజకులు ధరించే నారబట్టలు తాల్చి ධීදී పర్యవేక్షణం క్రింది ప్రభువుకి సేవలు చేసేవాడు. అన్నా ශීථීඝ బలిసమర్పించడానికి దేవాలయానికి వచ్చేది. వచ్చినపుడెల్ల క్రొత్త అంగీని కుట్టుకొని వచ్చి బాలునికి తొడిగేది. దేవుడు అన్నా భక్తికి మెచ్చి ఆమెకు ఇంకా ఐదుగురు బిడ్డల్ని ప్రసాదించాడు. సమూవేలు దేవళంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. అన్నా దైవభక్తి కల తల్లి.

46. సమూవేలుకి పిలుపు - 1సమూ 3

యూదులు షిలో నగరంలో గుడారం పెట్టుకొని దేవుణ్ణి పూజిస్తుండే GD