పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓ ద్రాక్షతోట వుంది. రాజు కూరగాయలు పండించుకోవడానికి ఆ తోటను తనకమ్మమని రైతుని అడిగాడు. నాబోతు ఈ భూమి వంశపారంపర్యంగా మా కుటుంబానికి చెందాలి. కనుక నేను దీన్ని అమ్మలేను అని చెప్పాడు. అహాబు నిరుత్సాహపడ్డాడు. కాని యెసెబెలు రాజు వ్రాసినట్లుగానే జాబు వ్రాసి, రాజముద్ర వేసి ఊరిపెద్దలకు పంపింది. దానిలో నాబోతు మీద దొంగనేరం మోపి అతన్ని రాళ్లతో కొట్టి చంపించమని ఆదేశించింది. ఊరి పెద్దలు అది అహాబు వ్రాసిన జాబే ననుకొని నాబోతుని అన్యాయంగా చంపించారు. ఇదే అదుననుకొని అహాబు రైతు పొలాన్ని స్వాధీనం చేసికోబోయాడు. కాని దేవుడు ఏలీయా ప్రవక్తను పంపగా అతడు వచ్చి ధైర్యంగా రాజుని ఎదిరించి చీవాట్లు పెట్టాడు. నీవు ఒక పేద రైతుని చంపించి అతని పొలాన్ని గూడ దొంగిలించబోతున్నావు. దీనికి శిక్షగా నాబోతు నెత్తురు కుక్కలు నాకిన తావననే నీ నెత్తురు కూడ శునకాలు నాకుతాయి అని శపించాడు. యెసబెలు శవాన్ని కుక్కలు పీకుకొని తింటాయి అని పల్కాడు. తర్వాత అతని శాపవాక్యాలు అక్షరాల నెరవేరాయి.

73. ఏలీయా స్వర్గానికి వెళ్లిపోవడం - 2రాజు 21-18

ఏలీయా స్వర్గానికి వెళ్లిపోయే సమయం దగ్గరించింది. అతడూ ఏలీషా గిల్లాలు నుండి యోర్గాను నది చెంతకు వచ్చారు. దారిలో తోడిప్రవక్తలు వారిని కలసికొని ఈరోజు ఏలీయా స్వర్గానిక వెళ్లిపోతాడు అని గుసగుసలాడుకొన్నారు. ఏలీయా తన అంగీని తీసి నది నీళ్లను కొట్టగా అవి రెండుగా విడిపోయి దారి యేర్పడింది. గురుశిష్యులు ఆవలివొడ్డు చేరుకొన్నారు. ఏలీయా శిష్యునితో ప్రభువు నన్ను తీసికొని పోకముందే నేను నీకు ఏమి వుపకారం చేయాలో కోరుకో అన్నాడు. ఏలీయా నాకు నీ శక్తిలో రెండు వంతులు దయచేయి అని అడిగాడు. శిష్యుడు గురువుకి అనుయాయియై అతని ఉద్యమాన్ని కొనసాగించాలి కదా! ఏలీయా నీ వడిగింది కష్టమైన వరం. ప్రభువు నన్ను కొని పోయేటప్పడు నేను నీకు కన్పిస్తే నీ కోర్కెనెరవేరుతుంది అని చెప్పాడు. వెంటనే నిప్ప గుర్రాలు లాగే అగ్నిరథం వారి మధ్యకు వచ్చింది. ఏలీషా