పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాత నిబంధన కథలు-2

43. సంసోను విషాద మరణం- న్యాయాధి 16, 23-31

ఫిలిస్టీయులు వారి దేవుడు డాగోనుకి ఉత్సవం జేసికొంటూ సంసోనుని తమ దేవాలయానికి కొనిపోయారు. అక్కడ అతడు వీరకార్యాలు చేయగా చూచి ఆనందించారు. అతనితో చెలగాటమాడారు. ఆ దేవళం రెండు పెద్ద స్తంభాల మీద నిల్చి వుంది. సంసోనుకి తలజట్టు మళ్లా పెరిగి నూత్నబలం వచ్చింది. అతడు రెండు స్తంభాలమీద చేతులు ఆనించాడు. దేవుణ్ణి స్మరించుకొని ప్రభూ! ఇంకొక్కమారు నాకు బలాన్ని దయచేయి అని ప్రార్థించాడు. ఆ మీదట ముందుకు వంగి స్తంభాలను బలంగా నెట్టాడు. వెంటనే రెండస్తుల మందిరం పెళ్లున కూలి నేలమీద పడింది. అక్కడ ప్రోగైయున్న మూడు వేలమంది ఫిలిస్టీయులు వారి నాయకులు అందరూ చచ్చారు. వారితోపాటు సంసోనుగూడ గతించాడు. అతడు బ్రతికి వున్నప్పటికంటె చనిపోయినప్పడే ఎక్కువమంది ఫిలిస్టీయులను చంపాడు. అసలు వారితో పోరాడ్లానికే ప్రభువు అతన్ని న్యాయాధిపతిగా ఎన్నుకొన్నాడు.

44. రూతు భక్తి

న్యాయాధిపతుల కాలంలోనే రూతు కూడ జీవించింది. యూదయా దేశంలో కరువు రాగా నవోమి అనే స్త్రీ పెనిమిటితో, ఇద్దరు కొడుకులతో మోవాబు దేశానికి వలసపోయింది. అక్కడ యిద్దరు కుమారులూ మోవాబు పడతులను పెండ్లిచేసికొన్నారు. పెద్దామె ఓర్ఫా, చిన్నామె రూతు. కాని ఆ దేశంలో నవోమి పెనిమిటీ, ఇద్దరు కుమారులూ చనిపోయారు. ముగ్గురు విధవలు మాత్రమే మిగిలారు. కరువు అంతరించి మళ్లా వానలు కురిసినందున నవోమి స్వీయదేశానికి తిరిగి రాగోరింది. పెద్ద కోడలు పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్నకోడలు రూతుమాత్రం అత్తకు అంటిపెట్టుకొని వుండిపోయింది. నేను నీ వెంటనే వస్తాను. నీ బంధువులు నా బంధువులు.