పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నరుడు దేవుని చిత్తానికి లొంగడమంటే యేమిటి? మన జీవితంలో జరిగే మంచి చెడ్డలన్నీ దేవునికి ముందుగానే తెలుసు. అతడు వాటిని అనుమతిస్తాడు. అతని అనుమతి లేకుండా యేమీ జరగదు. ఇంకా దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు అన్నీ మంచినే చేసిపెడతాయి -రోమా 8,28. మనం కష్టాలు, విపత్తులు అనుకొనేవి కూడ కడన మంచినే చేసిపెడతాయి. కనుక మన తరఫున మనం దేవుని ఆజ్ఞలకూ, అతడు అనుమతించే మంచి చెడ్డలకూ లొంగి జీవించాలి. కష్టాల్లో మొరపెట్టకూడదు. 2) దైవచిత్తానికి ఎందుకు లొంగాలి? దేవుడు సృష్టికర్త, నరుడు అతడు చేసిన ప్రాణి. మన మీద అతనికి సర్వాధికారమూ వుంటుంది. కనుక దాసుడు యజమానునికి లాగ మనం దేవునికి లొంగాలి. బిడ్డడు తండ్రికి ఎదురు తిరుగకూడదు. ఇంకా, మన యిష్ట ప్రకారం గాక దేవుని చిత్తప్రకారం జీవిస్తేనే మనం పవిత్రులమయ్యేది. జీవితంలో మనం సాధించవలసిన ప్రధానకార్యం పవిత్రతే కనుక ఎల్లవేళల దేవుని చిత్తాన్ని పాటించాలి. క్రీస్తు తన చిత్తప్రకారం జీవించలేదు. తండ్రి చిత్తానుసారం జీవించాడు. నా చిత్తం గాదు, నీ చిత్తమే నెరవేరాలి అని పల్మాడు -మత్త 26, 39. మరియమాత నేను ప్రభువు దాసురాలిని అని నుడివింది. పునీతులంతా దేవుని చిత్తప్రకారం జీవించినవాళ్లే. కనుక మనకు కూడ దైవచిత్తం అనుసరణీయం. 3) దైవ చిత్తాన్ని పాటించే తీరు ఆయా కార్యాలు మనకు అనుకూలంగా జరిగినప్పడు మాత్రమే కాదు, ప్రతికూలంగా జరిగినప్పుడు కూడ దైవచిత్తాన్నిపాటించాలి. కష్టాలు, వ్యాధిబాధలు, మరణం మొదలైన వాటిల్లో కూడ దైవనిర్ణయానికి లొంగాలి. కీడులను దేవుడు స్వయంగా పంపడు. మన మేలు కొరకు వాటిని అనుమతిస్తాడు. ఆ కీడులను మేళ్లుగా మారుస్తాడు. అదే అతని మంచితనం.