పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబంలోనే హత్యలు జరుగుతాయి. నీ భార్యలను మరొకడు చెరుస్తాడు అని చెప్పాడు. ఈలా నాతాను ప్రభువు పలుకులను విన్పింపగా దావీదు పశ్చాత్తాప పడ్డాడు. నేను యావేకు ద్రోహంగా పాపంచేశాను అని వొప్పకొన్నాడు. ప్రవక్త దేవుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పాడు. దావీదు పాపానికి శిక్షగా బత్తెబకు పుట్టిన బిడ్డడు చనిపోయాడు. రాజు వాడికొరకు శోకించాడు. బత్తెబ్ర మరల గర్భవతియై ఇంకో బిడ్డళ్లీ కంది. అతడే సొలోమోను రాజు. ప్రవక్త అతనికి యెదీద్యా అని పేరుపెట్టాడు. యావేకు ఇష్టుడు అని ఆ పేరుకి అర్థం.

59. ఇత్తయి స్వామి భక్తి - 2సమూ 15, 16-22

అబ్బాలోము దావీదు కుమారుల్లో వొకడు. అతడు తండ్రి మీద తిరగబడి రాజ్యాన్ని ఆక్రమించుకోజూచాడు. దావీదు అతనికి దడిసి పట్టణం నుండి పారిపోతున్నాడు. అన్యజాతి వాడైన ఇత్తయి దావీదు సేవకుల్లో వొకడు. అతడు కూడ రాజుతోపాటు ప్రవాసానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. దావీదు ఓయి! నీవు ఇటీవలే నా కొలువులో చేరావు. ఇప్పడు నాతో వచ్చి ప్రవాసంలో బాధలు అనుభవించడం దేనికి? క్రొత్తరాజు కొలువులోచేరి సుఖంగా జీవించు. వెనుదిరిగిపో అని చెప్పాడు. కాని యిత్తయి నేను నీతోనే వస్తాను. చావుగాని బ్రతకు కాని రాజెక్కడ వుంటాడో ఈ దాసుడు కూడ అక్కడే వుంటాడు అని పల్మాడు. ఇత్తయి స్వామి భక్తికి మెచ్చుకొని దావీదు అతన్ని వెంట తీసికొనిపోయాడు.

60. దావీదు ఔదార్యం - 2సమూ 9

దావీదు సౌలు కుటుంబంలో ఇంకా యెవరు మిగిలివున్నారని విచారించగా యోనాతాను కుమారుడు మెఫీబోషెతు మిగిలివున్నాడని తెలిసింది. అతని రెండు కాళూ కుంటివి కనుక సరిగా నడవలేడు. దావీదు సౌలు కుటుంబాన్ని ఆదరంతో చూస్తానని యోనాతానుకి మాట యిచ్చాడు. కనుక మెఫీబోషెతుని పిలిపించి ఇకమీదట నీవు రాజభవనంలో నా సరసన కూర్చుండి భోజనం చేయి అని చెప్పాడు. ఆ అవిటివాడు అయ్యా! నేను ఏ