పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గర్భందాల్చినట్లు ప్రచారం చేయగోరి దావీదు యుద్ధం నుండి ఊరియాను పిలిపించాడు. కాని దావీదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఊరియా ఇంటికిపోక రాజభవనంలోనే రాజు అంగరక్షకులతో కలసి నిద్రించాడు. అతడు యుద్ధంలో యోవాబు, సైనికులు పోరాడుతూ గుడారాల్లోనే నిద్రిస్తున్నారు. ఈలాంటి సమయంలో నేను ఇంటికిపోయి తిని త్రాగి ఆలిని కూడ్డం ధర్మం కాదు అన్నాడు. కనుక దావీదు పన్నాగం ఫలించలేదు. అతడు మరో పన్నుగడ పన్నాడు. పోరు ముమ్మరంగా జరిగే చోట ఊరియాను మొదటి వారుసలో వుంచండి. శత్రువులు వచ్చి మీద పడినప్పడు మీరు కొంచం వెనుకకు తగ్గండి. దెబ్బలు తిని అతడే చస్తాడు అని యోవాబుకి జాబు వ్రాసి దాన్ని ఊరియా చేతనే పంపించాడు. రాజకోరినట్లే ఊరియా పోరులో చనిపోయాడు. దావీదు బత్తెబాను పెండ్లిచేసికొన్నాడు. వారికి బిడ్డడు పుట్టాడు.

58. నాతాను ప్రపక్త దావీదును మందలించడం –2సమూ 12

దావీదు చేసిన మోసం యావేకు కోపం రప్పించింది. ప్రభువు నాతాను వ్రపక్తను పంపగా అతడు వచ్చి దావీదుకి ఓ కథ చెప్పాడు. ఓ నగరంలో ఓ ధనవంతుడూ పేదవాడూ వున్నారు. ధనవంతునికి గొర్రెల మందలూ గొడ్ల మందలూ వున్నాయి. పేదవాడికి ఓ గొర్రె పిల్ల మాత్రమే వుంది. అతడు దాన్ని అల్లారుముదుగా పెంచుకొంటున్నాడు. ఓ దినం సంపన్నుని యింటికి చుట్టం వచ్చాడు. అతనికి విందు చేయడానికి ధనవంతుడు తన గొర్రెను చంపక బలవంతంగా పేదవాని గొర్రెపిల్లను గైకొని భోజనం తయారుచేయించాడు చూచావా అని చెప్పాడు. దావీదు ఆ కథ విని ఉగ్రుడై ఈ యన్యాయానికి పాల్పడినవాడు ద్రోహి. అతడు నాలు వంతులు నష్టపరిహారం చెల్లించి తీరాలి అన్నాడు. నాతాను వెంటనే అందుకొని ఆ ద్రోహివి నీవే సుమా! యావే పలుకులు ఆలించు. నీకు ఇందరు భార్యలుండగా నీవు ఓ పేదవాని భార్యను అపహరించావు. పైగా ఆ పేదవాణ్ణి మోసంతో కత్తితో చంపించావు. దీనికి ప్రతీకారంగా నీ L