పుట:Prasarapramukulu022372mbp.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

85

క్రీస్తు చరిత్ర, బాపుజీ, నేతాజీ, గబ్బిలం, ఫిరదౌసి, స్వప్నకథ, స్వయంవరం, కాందిశీకుడు, ముసాఫిరులు, తారాబాయి, మీరాబాయి ప్రసిద్ధ ఖండకావ్యాలు, ఎన్నో నవలలు, నాటకాలు వ్రాశారు.

1910 లో వీరికి వివాహం జరిగింది. అంటరాని తనం పనికి రాదని ఆక్రోశించిన కవి ఆయన. దీపాల పిచ్చయ్యశాస్త్రి, జాషువా జంట కవులుగా పద్యరచనకు పూనుకొన్నారు. 'పిచ్చి జాషువా' 'జాషువాపిచ్చులు' అనే జంటనామం కుదరక మళ్ళీ విడివిడిగా రచనలు చేశారు. హరిశ్చంద్ర నాటకంలో 'కాటిసీమ' పద్యాలు జాషువా గారివే యిప్పటికీ నటులు ప్రదర్శించడం విశేషం. 1915-16 మధ్య కాలంలో మూకీకథా చిత్రాలకు వాచకుడుగా పనిచేశారు. కొంతకాలం నాటక కర్తగా 'చింతామణి నాటకమండలి' వారికి సహకరించారు. 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా గవర్నరు నామినేట్ చేశారు. ఆఆ పదవిలో కొంతకాలం పనిచేశారు. 1970లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కళాప్రపూర్ణతో, భారత ప్రభుత్వం పద్మభూషణతో సత్కరించాయి. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు స్వయంగా గండపెండేరం జాషువా కాలికి తొడిగారు. 1964లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. జాషువా మహాకవి 1971 జులై 24న మరణించారు.

జాషువాగారి కుమార్తె హేమలతా లవణం. వీరు జాషువా శతజయంతి వైభవంగా జరిపి జ్ఞానపీఠ స్థాయిలో ఏటా ఒక లక్ష రూపాయలతో ఒక కవిని సన్మానించే సంప్రదాయం మొదలుపెట్టారు.

ఆచంట జానకీరామ్‌ :

1938 జూన్ 16న మదరాసులొ సీనియర్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఆచంట జానకీరామ్‌ పనిచేశారు. సుప్రసిద్ధ సంఘసేవకురాలు, అవిభక్త్ర మదరాసు రాష్ట్రంలో ఆరోగ్యశాఖా మంత్రిణి డా. ఆచంట రుక్మిణమ్మ, లక్షీపతి కుమారులు. జానకీరామ్‌ 1903 జూన్ 16న జన్మించారు. తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్