పుట:Prasarapramukulu022372mbp.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

81

"వాణి" పక్షపత్రిక మదరాసునుండి రెండు దశాబ్దాలపైగా కార్యక్రమ వివరాల పత్రికగా వెలువడింది. అ తరువాత 1972లో విజయవాడ కేంద్రానికి 'రజని'గారి హయాంలో తరలించబడింది. 1985 ప్రాంతాలలో పక్షపత్రిక 'వాణి' లాభదాయకం కాదనే కారణంతో మంత్రిత్వశాఖ మూసివేసింది. అది లేని లోటు తీరనిది.

మదరాసు 'బి' కేంద్రంనుండి తెలుగు కార్యక్రమాలు యిప్పటికీ ప్రసార మవుతున్నాయి. 1948 డిసెంబరులో, విజవాడ కేంద్ర ప్రారంభమయ్యేవరకు తెలుగు ప్రసారాలు మదరాసు నుండే ఒక దశాబ్ది వరకు కొనసాగాయి. అప్పట్లో 'LIVE' కార్యక్రమాలు ఎక్కువ ఉండేవి. నాటకాలు, సంగీత కార్యక్రమాలు అన్నీ యధాతథంగా ప్రసారమయ్యేవి. ఆ తర్వాత గ్రామపోను రికార్డులు 'కట్‌' చేసేవారు. అది శ్రమతో కూడినపని. 'స్పూల్ టేప్‌లు' వాడకం మొదలైన తర్వాత రికార్డింగులో సౌలభ్యం సమకూరింది. కార్యక్రమ నిర్వహకులు ఆర్టిస్టులకు బాగా రిహార్సల్సు యిచ్చి కార్యక్రమాన్ని రూపొందించి 'ప్రొడ్యూస్‌' చేయడానికి శ్రమపడేవారు. అవిభక్త మదరాసు రాష్ట్రంలో ఆంధ్రదేశంలో చాలా భాగం వుండటం వల్ల ప్రసారాలు చాలమంది వినేవారు. 1942-45 మధ్య కాలంలో ఢిల్లీనుండి తమిళ తెలుగు కార్యక్రమాలు దక్షిణప్రాంత వాసులకు ప్రసారమయ్యేవి.

మదరాసు కేంద్రంలో యిటీవలి దశాబ్దిలో పని చేసిన ప్రముఖులలో సర్వశ్రీ యస్. వేణుగోపాలరెడ్డి, యస్. శంకర్ నారాయణ, వి. చంద్రమౌళి, దుర్గాభాస్కర్, వింజమూరి లక్ష్మీ, గొల్లపూడి మారుతీరావు, యిలా ఎందరో చెప్పుకోదగినవారు.

S. వేణుగోపాల రెడ్డి 15-2-40న శ్రీకాళహస్తి తాలూకాలో జన్మించారు. 1963లో ట్రాnస్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఆకాశవాణిలో చేరి దార్వాడ్, మదరాసు కేంద్రాలలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా, అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా వ్యవహరించారు. 23-1-85న స్టేషన్ డైరక్టర్‌గా తిరుచునాపల్లి బదిలీ అయ్యారు. 1992-93 మధ్యకాలంలో మదరాసు కేంద్ర స్టేషన్ డైరక్టర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత పాండిచేరి వెళ్ళారు. అక్కడినుండి బొంబాయి కేంద్రం డైరక్టర్ అయ్యారు.

S. శంకరనారాయణ 20-2-37న జన్మించారు. సుప్రసిద్ధ చిత్రకారులు, సంగీత దర్శకులు 'బాపు' వీరి సోదరులు. శంకర నారాయణ ట్రాన్స్‌మిషన్ ఎగ్జి