పుట:Prasarapramukulu022372mbp.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

ప్రసార ప్రముఖులు.

నిర్వాహకుడుగా 1994లో పదవీ విరమణ చేశాడు. కార్మికులకార్యక్రమ నిర్వాహకులుగా ఈయన పేరు గడించారు. వీరిని ఆమెరికాలో సన్మానించారు. కవి, రచయిత అయిన సలాది విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. ' ఆరవి ' గా పేరు పొందిన ఆచంట సూర్యనారాయణమూర్తిగా ఈ కేంద్ర డైరక్టరుగా చక్కటి కార్యక్రమాల రూపకల్పనకు నాందీ ప్రవచనం చేశారు.

ఆచంట సూర్యనారాయణమూర్తిగారు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా హైదరాబాదులో పనిచేసి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ గా విశాఖపట్టణం వెళ్ళారు. అక్కడే డైరక్టరుగా పనిచేశారు. తర్వాత హైదరాబాదు వాణిజ్య ప్రసార కేంద్రం డైరక్టరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం హైదరాబాదులోని థియోసాఫికల్ సొసైటీ సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు. వీరు చక్కని రచయిత.

విశాఖపట్టణం కేంద్ర సంగీత విభాగంలో మృదంగ విద్వాంసులు శ్రీ వంకాయల నరసింహం, కొమండూరి కృష్ణమాచార్యులు, శ్రీమతి ఇందిరా కామేశ్వరరావు ప్రసిద్ధులు.

మదరాసు కేంద్రం

1927 జులై 23న బొంబాయిలో అప్పటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీకి చెందిన తొలి రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. గత 70 సంవత్సరాలలో రేడియోప్రసారాలు విరాట్ స్వరూపాన్ని పొందాయి. 1936లో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ 'ఆల్ ఇండియా రేడియో ' గా నామాంతరం పొందింది. మైసూరులొ రేడియో ప్రసారాలు 'ఆకాశవాణి ' గా పేర్కొనబడేవి అదే పేరు "ఆల్ యిండియా రేడియో ' స్వీకరించింది.

ఆకాశవాణి నుండి తొలితెలుగు ప్రసారాలు మదరాసు కేంద్రం నుండి 1938 జూన్ 1 నుండి ఆరంభమయ్యాయి. తొలి తెలుగు అనౌన్సర్ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు. ఆయన సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరులు. మదరాసు కేంద్రం సాంస్కృతిక వారదిగా వ్యవహరించేది. అప్పట్లో సుప్రసిద్దులెందరో కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేశారు. సర్వశ్రీ సూరినారాయణమూర్తి, డా.అయ్యగరి వీరభద్రరావు, ఆచంట జానకీరాం, డా. బాలాంత్రపు రజనీకాంతరావు, బుచ్చిబాబు, ప్రయాగ, జలరుక్, జాషువా మొ||