పుట:Prasarapramukulu022372mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

77

96 మధ్యకాలంలో సంగీత విభాగం డైరక్టరుగా పనిచేశారు. వీరి సోదరులు గిరిజా శంకరరావు హైదరాబాదు కేంద్రం అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా పనిచేశారు.

రాళ్ళపల్లి విశ్వనాథం 1937 జనవరి 13న శ్రీకాకుళంజిల్లాలో జన్మించారు. విశ్వనాథం ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా 23-7-63 నుండి మదరాసు, బెంగుళూరు, విశాఖపట్టణం కేంద్రాలలో పనిచేసి ఒరిస్సాలోని సంబల్‌పూర్ బదలీ అయ్యారు. వీరు 1963లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. పట్టా పొందారు. కొంతకాలం మదరాసు ఆంధ్రపత్రిక దినపత్రిక కార్యాలయంలో పనిచేశారు. 1975 జూలైలో కడపకేంద్రానికీ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా బదలీ అయ్యారు. అక్కడ నుండి విజయవాడ, అదిలాబాద్, హైదరాబాదు, వరంగల్ కేంద్రాలలో పనిచేశారు. 1986లో ASD అయి 90 నుండి స్టేషన్ డైరక్టర్‌గా C.B.S. హైదరాబాదులో పనిచేశారు. 1996 జనవరి 31న రిటైరయ్యారు. కార్యక్రమ రూపకల్పన పట్ల చక్కని అవగాహన గల విశ్వనాథం స్నేహశీలి.

భూషణరావుగా ప్రసిద్ధులైన కె.రాజభూషణరావు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా కడప, విశాఖపట్టణ కేంద్రాలలో రెండు దశాబ్దాలు పనిచేసి 1994లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా పదవీ విరమణ చేసి భీమ్లీలో స్థిరపడ్డారు.

డా.తక్కోలు మాచిరెడ్డి హిందీలో పి.హెచ్ డి. చేసిట్రాన్సుమిషన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఆ తర్వార U P S C ద్వారా 1975లో P B X గా చేరారు. జగదల్‌పూర్, కడప, రాంపూరు, స్టేషన్లలో పనిచేశరు. 1994లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా మడికెర (మైసూర్) బదలీ అయి తర్వాత అనంతపురం కేంద్రానికి వచ్చారు. సాహిత్యంలో చక్కటి అవగాహనగల మాచిరెడ్డి అభ్యుదయ భావాలు గల వ్యక్తి.

కడపజిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన శ్రీనివాసులు చక్కటి గాయకుడు. అరవీటి శ్రీనివాసులు జానపద సంగీతవిభాగ ప్రయోక్తగా చక్కటి కార్యక్రమాలు