పుట:Prasarapramukulu022372mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

67

ఈ గ్రంథం 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ అనువాదకుని బహుమతి తెచ్చిపెట్టింది. ఛాయారేఖలు, ఆంధ్రమణిహారం రామాయణమ్లో స్త్రీ పాత్రలు, యశోద, నీరు, భక్తి సాహిత్యం, భయం వేస్తోందా భారతీ, ఇతర రచనలు. వీరి మారని నాణెం, సంజ వెలుగు, వక్రించిన సరళరేఖ నవలపై శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో శ్యాంప్రసాద్ పరిశోధన చేసి M. Phil. పట్టా పొందారు. జర్మనీ రేడియో వారి ఆహ్వానం మేరకు 1996 ఆగష్టు నెలలొ ప్రసార మాధ్యమాలపై జర్మనీలోని కొలోన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పద్మనాభరావు భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 12 దేశాల ప్రతినిధులు యిందులో పాల్గొనడం విశేషం.

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో శ్రీకాంతశర్మ 29-5-44లో జన్మించారు. సుప్రసిద్ధకవి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి వీరి తండ్రి. ఎం. ఏ. పట్టభద్రులై ఆంధ్రజ్యోతి వారపత్రిఅక్లో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశారు. అభ్యుదయ కవిగా శర్మ ప్రసిద్ధులు.

1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరారు. తెలుగు ప్రసంగాల శాఖకు ఉషశ్రీకి సహాయకులుగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. శర్మ చక్కని రూపకాలు రచించారు. వీరు రచించిన అమరారామం రూపకం 1981 లో జాతీయ స్థాయిలో బహుమతి పొందింది. 1986లో ' వర్షానందిని ', ' నేను కాని నేను ' బహుమతులు జాతీయస్థాయిలో అందుకోవడం విశేషం 1994లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నిజామాబాద్ కేంద్రంలో చేరారు. 1995లో స్వచ్చంద పదవీ విరమన చేసి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరారు.

కవిగా రచయితగా శ్రీకాంతశర్మ లబ్ధప్రతిష్టులు. వీరి రచనలు అలనాటి నాటకాలు శిలామురళి, పొగడపూలు, ఆలొచన, గాధావాహిని, సాహిత్య పరిచయం ప్రసిద్ధాలు. రూపక రచయితగా, గేయ రచయితగా శ్రీకాంతశర్మ శ్రోతలకు పరిచితులు. కొన్ని సినీ గీతాలు కూడా శర్మ వ్రాశారు. శర్మ స్నేహశీలి. వీరికి నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించాయి.