పుట:Prasarapramukulu022372mbp.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

51

1944 మేలో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకులుగా చేరారు. 1966లో అసిస్టెంట్ డైరక్టరుగా పదోన్నతిపై పశ్చిమ బెంగాలులోని కర్సియాంగ్ స్టేషన్ కెళ్ళారు. కర్సియాంగ్ నుండి ఢిల్లీలోని ట్రాన్స్క్రిప్షన్ సర్విసులో చేరారు. 1970లో స్టేషన్ డైరక్టరై అహమ్మదాబాదు వెళ్ళారు. 1971 నుండి 76 వరకు విజయవాడ కేంద్రం డైరక్టరు. 76 నుండి 78 జనవరి వరకు బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేసి జనవరి 31న రిటైరయ్యారు.

వీరి రచనలు జేజిమామయ్య పాటలు చిన్న పిల్లలకు నర్సరీ గీతాలు. విశ్వ తాము రచించిన సంగీత రూపకాలు 1964లో ప్రచురించారు. త్యాగరాజు, శ్యామశాస్త్రి జీవిత గ్రంథాలను ప్రచురించారు. తండ్రిగారి ఏకాంత సేవకు ఆంగ్లంలో Alone with spouse divine అనువాదం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారికి క్షేత్రయ్యపై ఆంగ్లంలో (Amourse of the Divine Cowherd) గ్రంథం వ్రాశారు. మువ్వ గోపాల పదాలను ఆంగ్లంలొకి అనువదించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదంతో (1980), నాదసుధార్ణవ బిరుదంతో మదరాసు మురళీరవంళి ఆర్ట్ అకాడమీ వీరిని సత్కరించాయి.

డా: మంగళం పల్లి బాల మురళీ కృష్ణ:

పారు పల్లి రామ కృష్ణయ్య పంతులు శిష్యులలొ అగ్ర గణ్యులు మంగళం పల్లి బాల మురళీ కృష్ణ. బాల మురళి 1930 జూలై 6 న తూర్పు గోదావరి జిల్ల శంకర వంతంలో పట్టాభి రామయ్య గారికి జన్మించారు. తండ్రి ప్రసిద్ధ సంగీత విద్వాంసులు. వారి వద్ద శిక్షణ పూర్తి చేసుకొని విజయ వాడలో పారు పల్లి రామ కృష్ణయ్య పంతులు వద్ద విద్యాభ్యాసానికి చేరారు. ఆయన బాల గందర్వుడు. చిన్న తనం నుండి సంగీతంలో ప్రావీణ్యం చూపారు. కర్ణాటక సంగీగంలో 8వ ఏట సంగీత కచేరీ నిర్వహించిన దిట్ట.

వయెలిన్, వయోల, మృదంగ వాదనలలో ప్రావీణ్యం సంపాదించారు. 1965 వ సంవత్సరం ఆకాశ వాణి., మదరాసు, విజయ వాడలలో సంగీత శాఖ ప్రొడ్యూసర్ గా పని చేసి విశిష్ట సేవలు చేశారు. ఆ తర్వాత రాజీనామా చేశారు. విజయ వాడలో ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా కొంత కాలం పని చేశారు.