పుట:Prasarapramukulu022372mbp.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

ప్రసార ప్రముఖులు.

పురస్కారం లభించింది. పెళ్లాడే బొమ్మ, తీరని కోరికలు నాటకాలు, నాగరిక, చెట్లు గేయ సంపుటిని రచించారు. వీరు 1968 మార్చిలో ఢిల్లీలో చనిపోయారు. వీరి కుమారులు రామచంద్రరావు జర్నలిస్టుగా విజయవాడలో స్థిరపడ్డారు.

పింగళి లక్ష్మీకాంతం (1894-1972)

పింగళి లక్ష్మీకాంతంగారు 1894 జనవరి 10న కృష్ణాజిల్లాలో ఆర్తమూరులో జన్మించారు. రేపల్లె, మచిలీపట్నం, మదరాసులలో చదువు పూర్తి చేసుకొని ఎం. ఏ. పూర్తి చేశారు. మచిలీపట్నంలో చదువుకొంటుండగా చెళ్ళపిళ్ళవారి శిష్యరికం లభించింది. కవితాధార ఉవ్వెత్తువ లేచింది. బందరులో తాను చదివిన కళాశాలలోనే ఆంధ్ర పండితులుగా చేరారు. కొంతకాలం తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో ఆచార్య పదవి నిర్వహించారు. అక్కడ రిటైరైన తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా వ్యవహరించి 1965 జూన్‌లో పదవీ విరమణ చేశారు.

'తొలకరి' రచనతో కాటూరి వెంకటేశ్వరరావుతో కలిసి జంట కవులుగా వ్యవహరించారు. సౌందరనందము జంటగా వ్రాసి గురువులైన తిరుపతి కవుల కంకితం చేశారు. మధుర పండితరాజం, పండితరాయల కవితా మాధుర్యం, సాహిత్య శిల్ప సమీక్ష, ఆంధ్ర సాహిత్య చరిత్ర, గౌతమ వ్యాసములు వీరి రచనలు.

ఆకాశవాణిలో తెలుగు ప్రసంగశాఖ ప్రయోక్తగా వ్యవహరించిన సమయంలో సూక్తి రత్నావళి కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. సరళ వ్యావహారిక భాషలో పదాల మిగళింపు ఆయన సొత్తు. సంస్కృత నాటకాలు ఎన్నో ఆయన సమర్పించారు. ఉత్తమ పరిశోధకులుగా, అధ్యాపకులుగా ఎందరో గురువులను తీర్చి దిద్దిన ఆచార్యుడాయన.

గౌతమ వ్యాసాలు, సంస్కృత వ్యాకరణం తెలుగు సాహిత్య విద్యార్థులకు కరదీపికలు.

'మాబిడిక్‌' నవలను, 'ఆంగ్లదేశపు చరిత్ర' అనే చారిత్రక గ్రంథాన్ని అనువదించారు. నటుడుగా ఆయన ప్రసిద్ధుడు. ధర్మరాజు, రాక్షసమంత్రి పాత్రలను సమర్థవంతంగా పోషించేవారు. ప్రాచ్య పాశ్చాత్య విమర్శనా ధోరణులను సమన్వయ పరచి తెలుగులో సాహిత్య విమర్శ చరిత్రకు నాందీ ప్రవచనం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ అకాడమీ విశిష్ట సభ్యులుగా పనిచేశారు. 1972 జనవరి 10న ఆయన పరమ పదించారు.