పుట:Prasarapramukulu022372mbp.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

43

నాటకాలు ప్రసారం చేశారు. ఆకాశవాణి నుండి నటులెందరో సినీరంగానికి తరలిపోయారు. సర్వశ్రీ విన్నకోట రామన్నపంతులు, రామచంద్రకాశ్యప, బచ్చా పూర్ణానందం, గొల్లపూడి మారుతీరావు, నిర్మల, సుత్తి వీరభద్రరావు, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎ. వి. సుబ్రమణ్యం, గుండు హనుమంతరావు సినీనటులు కావడానికి ముందు ఆకాశవాణి నటులు. జంధ్యాల ఆకాశవాణి నాటక రచయితగా పేరు పొందారు. ఉత్తమ నాటకాలు ఎన్నో ఈ కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. శ్రీనండూరి సుబ్బారావు, సి. రామమోహనరావు, శంకరమంచి సత్యం మంచి నాటకాలు రూపొందించారు.

విజయవాడ ఆకాశవాణి కేంద్ర పరిదిలో గుంటూరుజిల్లా, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, ఉభయగోదావరి, ఖమ్మం జిల్లాలు వచ్చాయి. ఇటీవల తూర్పు గోదావరి విశాఖపట్టణం పరిదిలోకి వెళ్ళింది. కొత్తగూడెం PM కేంద్రం 1989లో ప్రారంభమైన తర్వాత ఖమ్మం జిల్లా ఆ కేంద్ర పరిధిలోకి వెళ్ళింది. మార్కాపురం కేంద్రం ఒంగోలు జిల్లా శ్రోతలకు పరిమితం. 1973వ సంవత్సరంలో రజినిగారి పర్యవేక్షణలో రజతోత్సవాలు వైభవంగా జరిపి రజతోత్సవ సంచికను వెలువరించారు.

విజయవాడ కేంద్రంలో ఎందరో హేమాహేమీలు గత అర్థశతాబ్ది కాలంలో పనిచేసి ప్రఖ్యాతి గడించారు. సర్వశ్రీ పింగళి లక్ష్మీకాంతం, ఉషశ్రీ, కందుకూరి రామభద్రరావుశ్రీగోపాల్, ప్రయాగ నరసింహశాస్త్రి, N. C. V. జగన్నాదాచార్యులు వింజమూరి శివరామరావు, జదుక్‌శాస్త్రి, G. V. కృష్ణారావు, M. S. శ్రీరాం, రాచకొండ నరసింహమూర్తి, కేశవపంతుల నరసింహశాస్త్రి, వింజమూరి లక్ష్మి, డాక్టర్ లత, బుచ్చిబాబు, శ్రీవాత్సవ, నాగరత్నమ్మ, కూచిమంచి కుటుంబరావు ఎందరో మహానుభావులు ఈ కేంద్రం ప్రసారాలను సుసంపన్నం చేశారు.

పున్నమ్మ తోటలోని పాత భవనాల స్థానంలో బందరురోడ్డుపై నూతన కార్యాలయ భవనం, స్టూడియోలు వెలిశాయి. 1980లో ఈ భవనాలలోకి ఆకాశవాణి మారింది. ప్రాంతీయ వార్తా ప్రసార విభాగం 1981లో స్థాపించారు. ప్రతిరోజు దాదాపు 12గంటలు విజయవాడ 'ఎ' కేంద్రం, 12 గంటలు 'బి' కేంద్రం ప్రసారాలతో శ్రోతల్ని అలరిస్తున్నాయి. నంబూరులోని ట్రాన్స్‌మీటర్ స్థాయిని 1989లో 20కిలో వాట్లనుండి 100 కిలోవాట్ల మీడియంవేవ్ శక్తికి పెంచారు. కోస్తా జిల్లాలు తుపాను