పుట:Prasarapramukulu022372mbp.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

ప్రసార ప్రముఖులు.

నేనుకాని నేను జాతీయస్థాయిలో వన్నెకెక్కాయి. K. V. హనుమంతరావు రూపొందించిన శ్రమఏవజయతే, కృష్ణవేణి ప్రశంసలందుకొన్నాయి. పన్నాల సుబ్రహ్మణ్య భట్ సమర్పించిన నాదబంధం, మార్గబంధం బహుమతులందుకొన్నాయి. కలగా కృష్ణమోహన్, M. వాసుదేవమూర్తి - ఇలా ఎందరో బహుమతులు పొందారు. 1988లో ఉత్తమస్థాయి సాంకేతిక కేంద్రంగా గుర్తింపు లభించింది.

20 కిలోవాట్ల ప్రసారశక్తికి విజయవాడ కేంద్రస్థాయిని 1957 జనవరి 20న పెంచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. తొలినాళ్ళలో స్టేషన్ డైరక్టర్లుగా సర్వశ్రీ M. V. రాజగోపాల్, S. K. బోస్, G. P. S. నాయర్ వ్యవహరించారు.

విజయవాడ కేంద్రం ప్రసారం చేసే భక్తిరంజని బహుళ జనామోదం పొందింది. కూచిపూడి సాంప్రదాయానికి ప్రాచుర్యం తెచ్చింది విజయవాడ కేంద్రం. కర్ణాటక సంగీత, లలిత సంగీత కార్యక్రమాలు బాలమురళి, వోలేటి, మల్లిక్, రమణమూర్తి సారధ్యంలో నిర్వహించబడ్డాయి. శ్రీరంగం గోపాలరత్నం సుమధుర గాత్రం ఈ కార్యక్రమాలకు వన్నె తెచ్చింది. 1982 నుండి జానపద సంగీతానికి కూడా పట్టం కట్టి అణగారిపోతున్న జానపదకళలకు ఆదరణ కల్పించింది.

1962 ఆగష్టులో అప్పటి కేంద్ర ప్రసార సమాచార శాఖామాత్యులు డా. బెజవాడ గోపాలరెడ్డి వివిధ భారతి ప్రసారాల ' బి ' కేంద్రాన్ని ప్రారంభించాయి. 1971 మార్చి నుండి వాణిజ్య ప్రసారాలు ఆరంభమయ్యాయి. వ్యవసాయ ప్రసారాలు 1966 జూన్ 7 నుండి ప్రారంభమయ్యాయి. నిడుదవోలులో జరిగిన సభలో నీటి పారుదల శాఖామాత్యులు T. V. రాఘవులు వ్యవసాయ ప్రసారాలు ప్రారంభించారు. గుమ్మలూరు సత్యనారాయణ, కె. వి. సుబ్బారావు, వై. హనుమంతరావు, వ్యవసాయ విభాగానికి అధిపతులుగా మూడు దశాబ్దాలు ఈ కార్యక్రమాలను తీర్చిదిద్దారు. 1995 జూన్ లో మూడు దశాబ్దాల వార్షికోత్సవాన్ని వ్యవసాయ శాఖామత్యులు శ్రీ కోటగిరి విద్యాధరరావు బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన సభలో నిర్వహించారు. ఈ విభాగం జాతీయస్థాయిలో ఎన్నో బహుమతులు పొందింది.

రేడియో నాటకానికి విజయవాడ కేంద్రం ప్రాణం పోసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బందా కనకలింగేశ్వరరావు నాటక ప్రయోక్తగా ఎన్నో ఉత్తమ