పుట:Prasarapramukulu022372mbp.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

41

విజయవాడ కేంద్రం

1948 డిసెంబరు 1వ తేది ఆంధ్రుల సాంస్కృతిక కేంద్రమైన విజయవాడలో ఆకాశవాణి నెలకొంది. రెవిన్యూమంత్రి శ్రీ కళా వెంకట్రావు దాన్ని ప్రారంభించారు. 1 KW మీడియం వేవ్ పై ప్రసారాలు సాగేవి. ప్రసారశక్తి ఆరువేల చదరపు కిలోమీటర్లు. విజయవాడలో PWD ఎగ్జిక్యూటివ్ యింజనీర్ బంగళాలో ఆరెకరాల స్థలంలో దీన్ని స్థాపించారు. అప్పట్లో బెజవాడ క్లబ్ అక్కడ వుండేది. దాన్ని అద్దెకు తీసుకున్నారు. 120 అడుగుల ఎత్తుగల రిలే టవర్ నెలకొల్పారు. N. S. రామచంద్రన్ తొలి స్టేషన్ డైరక్టరు. M. S. నారాయణస్వామి స్టేషన్ యింజనీరు. మదరాసు ' బి ' కేంద్రం నుండి తెలుగు కార్యక్రమాలు రిలే చేసేవారు. తర్వాత కొంతకాలానికి 1950 లో డా. అయ్యగారి వీరభద్రరావు స్టేషన్ డైరక్టరుగా చేరారు. రెండేళ్ళ పరిపాలనలో ఆయన ప్రసారాలలో నూతనత్వాన్ని కలిగించారు.

సంగీతంలో ఉత్తమ ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం కావాలని 1948లోనే నిలయ విద్వాంసుల్ని నియమించారు. వారిలో ప్రసిద్ధులు శ్రీయుతులు అన్నవరపు రామస్వామి, దండమూడి రామమోహనరావు, N. Ch. కృష్ణమాచార్యులు. కార్యక్రమ నిర్వాహకులుగా ఈ కేంద్రంలో ఎందరో ప్రముఖులు పనిచేశారు. సర్వశ్రీ బుచ్చిబాబు, బందా కనకలింగేశ్వరరావు, డా. రజనీ కాంతరావు, పింగళి లక్ష్మీకాంతం, G. V. కృష్ణారావు, ఉషశ్రీ, డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సంధ్యావందనం శ్రీనివాసరావు, M. V. రమణమూర్తి, ఉషశ్రీ, ప్రయాగ నరసింహశాస్త్రి, శ్రీ గోపాల్, భద్రవ్రత, శంకరమంచి సత్యం, వోలేటి వెంకటేశ్వర్లు - ఇలా ఎందరో.

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతుల్ని ఈ కేంద్రం గెలుచుకొంది. గోదావరి నదిపై రూపొందించిన ' కొండ నుండి కడలి దాకా ' రూపకానికి రజనికి విద్యా ప్రసారాలలో "హోనబంకా" అవార్డు లభించింది. వ్యవసాయ విభాగంలో Y. హనుమంతరావుకు ' మధురక్షణాలు ' నాటకానికి బహుమతి వచ్చింది. శ్రీ గోపాల్ సమర్పించిన విక్రాంతగిరి శిఖరం, అరుణాచల జ్యోతి బహుమతులందుకొన్నాయి. శ్రీ రామం సమర్పించిన నీలినీడలు, నిశ్శబ్దం గమ్యం, మెట్లు, మహా విశ్వ అవార్డులు పొందాయి. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సమర్పించిన అమరారామం, వర్షానందిని,