పుట:Prasarapramukulu022372mbp.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మున్నుడి

ప్రసార ప్రముఖులు అనే శీర్షిక చూడటం తోటే 'అరె, నేను వ్రాసి వుండవలసిన శీర్షిక ఏమో' అనిపిస్తుంది. అయినా నా కిష్టుడు చాలా సమర్థుడు అయిన శ్రీ అనంత పద్మనాభరావు దానిని సిద్దం చేసి నన్ను మున్నుడి వ్రాయమని ఒకసారి దానిలో ప్రవేశం కలిగించారు.

నిజానికి నేను ఆకాశవాణి చరిత్ర Chronology (చారిత్రక పౌర్వావర్యం) సరిగ్గా తెలిసిన కొద్ది మందిలో ఒకణ్ని అయినప్పటికీ నామస్మరణంలోను, చర్విత చర్వణంలోను కొంచెం ముందు వెనుకలు తప్పనిసరిగా తారసిల్లడం సహజం !

ఇందులో దక్షిణ భారతంలో భారతీయ రేడియో (All India Radio) తొలి కేంద్రం నెలకొల్పడానికి Asbestos అట్టలను, స్టూడియో నిర్మాణానికై వడ్రపు కొయ్యలను, ఎగ్మూర్ మార్షల్స్ రోడ్డు, Eastnoox సౌధం పై డాబాల గదుల్లో వడ్రంగపుపనులు, తాపీ పనులు జరుగుతున్న సమయంలో ఆనాడు A I R తో ఏ సంబంధం లేని నేను ఆంధ్ర విశ్వవిద్యాలయ ఎం. ఏ విద్యార్థిగా మదరాసు కేంద్ర ప్రారంభ సమయంలో కేవలం ప్రేక్షకుడుగా వుండటం ఈనాటికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

మదరాసు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో యువకుడు వర్థిష్ణువు అయిన డా. బెజవాడ గోపాలరెడ్డిగారికి మే 8 వ తేదీ 1938న గురుదేవులు ఠాగూరు జన్మదినాన తన వివాహం జరగాలనే కోరికపై ముహూర్తం పెట్టారు. నవ్యసాహిత్య పరిషత్ కవులను ఆ పెళ్ళికి ఆహ్వానించారు. పచ్చయప్ప కళాశాల విడిది. శివశంకరశాస్త్రి కృష్ణశాస్త్రి వంటి కవులతో వారి శిష్యప్రాయుడుగా నేనూ ఒక కవిగా వెళ్ళాను.

జూన్ 1 వ తేదీన ప్రారంభించవలసిన మదరాసు కేంద్రంలో మొదటి నాటకం ఆ డాబా మీద గుండ్రని దిండ్లని, హుక్క గొట్టాలని (మొగల్ వాతావరణం కోసం) పెట్టుకొని కృష్ణశాస్త్రి సలీంగా, అయ్యగారి వీరభద్రరావు అక్బరుగా, వడ్డాది రామచంద్రమూర్తి అబుల్ ఫజుల్‌గా, S. N. మూర్తి ఫైజీగా నటిస్తు