పుట:Prasarapramukulu022372mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

25

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ 'సోవియట్ లాండ్ నెహ్రూ బహుమతులు అందుకున్నారు. జీవన సమరం పేర సామాన్యుని స్వగతాలు ఈనాడు పత్రికలో ధారావాహికగా ప్రచురితమై గ్రంధరూపంలో వచ్చాయి. జమీన్ రైతు, దీనబంధు, రేరాణి పత్రికలలో పని చేశారు.

ఆయన సతీమణి కాంతమ్మ మరణానంతరం స్మృతి కావ్యాలను ప్రచురించి ఆ రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం డాక్టరేట్ తో, కళాప్రపూర్ణ బిరుదంతో ఆంధ్ర విశ్వకళాపరిషత్ సత్కరించింది.

1987 లో ఆకాశవాణిలో పదవీ విరమణనంతరం తెలుగు విశ్వవిద్యాలయములో ప్రొడ్యూసర్ గా కొంత కాలం పని చేశారు.

అజర్ అఫ్సర్:

నయీరంగ్ కార్య క్రమాల నిర్వహణ ద్వారా ఉర్దూ కార్య క్రమాల రూప కల్పనకు అహరహం కృషి చేసి రెండు దశాబ్దాల పాటు ఖ్యతి గడించిన వ్వక్తి అజల్ అఫ్సర్. 1975 లో ఉర్దూ విభాగం ప్రొడూసర్ గా చేరి ఒక దశాబ్ది పాటు ఈ కార్య క్రమాలకు వన్నె తెచ్చిన వ్యక్తి అప్సర్. స్వయంగా ఉర్దూలో చక్కటి కవి. 1884 లో అజల్ అఫర్ పదవీ విరమణ చేశారు.

వసీం అక్తర్:

ఉర్దూ వార్తా విభాగంలో రెండు దశాబ్దాలు విచ్చిన్నంగా వార్తలు చదివిన వ్యక్తి వసీం అక్తర్. ఆయ ప్రత్యేక బాణీని ఎందరో మిమిక్రీ కళాకాఅరులు అనుకరించేవారు. ఆయన 1984 లో పదవీ విరమణానంతరం 1994 ప్రాంతంలో పరమ పదించారు.

డా. వడ్లమూడి గోపాలకృష్ణయ్య:

వాఙ్మయమహాధ్యక్ష, కళాప్రపూర్ణ వడ్లమూడి గోపాలకృష్ణయ్య కొద్దికాలం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో (1964 -66) ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఆ తరువాత వారు హైదరాబాదులోని ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారాధిపతిగా పని చేసి పదవీ విరమణ చేశారు. వ్యాకరణ శాస్త్ర వేత్త, బహు గ్రంథ రచయిత అయిన గోపాల కృష్ణయ్య బహుభాషావేత్త.