పుట:Prasarapramukulu022372mbp.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

23


వీరి ధర్మపత్ని శివరాజు సుబ్బలక్ష్మి రచయిత్రిగా పేరు పొందారు. బుచ్చిబాబు కవితాత్మగల చిత్రకారుడు. చిత్రకళా కోవిదుడైన కవి. అంతరంగ కథనం పేరుతో ఆయన తన బాల్య జీవితానుభవాలను అద్భుతంగా వ్రాసుకొన్నారు. 'శిల్పమంతా నీ చేతిలోవుంది బుచ్చిబాబూ, అని విశ్వనాథ సత్యనారాయణ, 'ఆంగ్లంలో నిధివి' అని పింగళిలక్ష్మికాంతం బుచ్చిబాబుని ప్రశంసించేవారు. ప్రముఖ సినీనటుడు పృథ్వీరాజ్‌ కపూర్ వీరిని బహుధా ప్రశంసించారు. రేడియో నాటకాలకు ఆయన మార్గదర్శి. వందకిపైగా రేడియో నాటికల్ని ప్రొడ్యూస్ చేశారు రేడియోకు ఆయన వ్రాసిన 'రాయలు కరుణకృత్యం' నాటక ఆధారంగా 'మల్లేశ్వరి' సినిమాతీశారు. స్టేజి నాటకాలను వ్రాసి ప్రదర్శనలిప్పించారు.

చివరకు మిగిలేది నవల 'నవోదయ' పత్రికలో దారావాహికంగా వెలువడింది. ఆ నవల దాదాపు పాతిక ముద్రణలు పొందింది. ఎంకి పాటలంటే ఆయన కిష్టం. ఆ పాటల ప్రేరణతో 'ఉత్తమ ఇల్లాలు' అనే రేడియో నాటకం వ్రాశారు. ఎంకి పాటలకు ఆయన బొమ్మలు వేసుకొని దాచుకొన్నారు. అంతటి ప్రజ్ఞాశాలి ఉద్యోగం చేస్తూ 51 వ ఏట కన్నుమూశారు.

దాశరథి (1926-87)

'నా తెలంగాణ కోటిరతనాల వీణ' అని సగర్వంగా పలికిన దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణలోని 'చిన గూడూరు'లో జన్మించారు. తెలంగాణ సూర్యచంద్రులుగా నారాయణరెడ్డి, దాశరథి పేరు గడించారు. నవాబు పరిపాలనను ఎదిరించి జైలుకెళ్ళారు. వీరికి జైలులో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పరిచితులయ్యారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలలో సమానంగా ఉర్దూలో పాండిత్యం సంపాదించారు. ఆయన మలేషియా అమెరికా మొదలైన దేశాలలో విస్తృతంగా పర్యటించారు. 1947-48 కారాగారవాసం చేశారు.

హైదరాబాదు, మదరాసు ఆకాశవాణి కేంద్రాలలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు వ్రాశారు. సినిమా కోసం రేడియోకు రాజీనామా చేశారు. వీరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థానకవిగా నియమించింది. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖవారు గౌరవ సలహాదారుగా (Producer Emiretus) నియమించారు. 1975లో ఆంధ్ర