పుట:Prasarapramukulu022372mbp.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
12
ప్రసార ప్రముఖులు.

హైదరాబాదు కేంద్రం స్టేషన్ డైరెక్టర్లుగా పని చేసిన ఆంధ్రులలో ప్రముఖులు వీరు : శ్రీ యం.వి రాజగోపాల్. వీరు విజయవాడ కేంద్రం డైరెక్టరుగా 1949-50 సం॥ లో పని చేసారు. హైదరాబాదు కేంద్ర డైరెక్టరుగా 19-8-55 నుండి 20-4-57 వరకు పని చేసారు. ఆ తరువాత I.A.S లో చేరి నెల్లూరు జిల్లా కలెక్టరుగా , ఆంధ్ర విశ్వ విద్యాలయ రిజిస్ట్రారుగా , రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ డైరెక్టరుగా, జవహర్ లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్.ఛాన్సలర్ గా వ్యవహరించారు. చక్కటి భాషా సాంకేతిక పరిజ్ఞానం గల మేధావి రాజగోపాల్. వీరు హైదరాబాదులో పరమపదించారు. డా॥ అయ్యగారి వీరబద్రరావు కూడా విజయవాడలో పని చేసిన తరువాత హైదరాబాదు కేంద్రానికి 15-3-65 నుండి 28-10-66 వరకు డైరెక్టరుగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన పసల గురుమూర్తి 3-6-74 నుండి 15-10-75 వరకు డైరెక్టరుగా పని చేసారు. అలానే పుల్లెల వెంకటేశ్వర్లు 15-10-75 నుండి 22-6-78 వరకు డైరెక్టరుగా చేసారు. 78 నుండి ఆకాశవాణి డైరెక్టరేట్ లో డిప్యూటీ డైరెక్టర్ జనెరల్ గా వ్యవహరించారు. హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. మైసూరు వాసుదేవాచారి మనుమలైన యస్. రాజారాం ఈ కేంద్ర డైరెక్టరుగా 25-9-81 నుండి 31-1-83 వరకు పని చేసి రిటైర్ అయ్యారు. శ్రీ వి వి శాస్త్రి 6-1-92 నుండి 31-10-96 వరకు డైరెక్టరుగా పని చేసి రిటైరయ్యారు.


హైదరాబాదు కేంద్రంలో పని చేసిన ఇతర కార్యక్రమ నిర్వాహకులలో ఎందరో మహానుభావులున్నారు. ఆయా రంగాలలో నిష్ణాతులైన లబ్ద ప్రతిష్టులైన ఎందరో ప్రసార ప్రముఖులు శ్రోతల అభినందన లందుకొన్నారు. సర్వశ్రీ త్రిపురనేని గోపీచంద్ (గ్రామీణ కార్యక్రమాలు) స్థానం నరసింహారావు (నాటక విభాగం ) దేవులపల్లి కృష్ణశాస్త్రి , దాశరధి, రావూరి భరద్వాజ(ప్రసంగ శాఖ) వింజమూరి వరదరాజయ్యంగార్,మంహాల జగన్నాధరావు,పాలగుమ్మి విశ్వనాథం, N.S.శ్రీనివాసన్ (సంగీత విభాగం) శ్రీమతి వింజమూరి సీతాదేవి (జానపద విభాగం ) రామమూర్తిరేఖ, వేలూరి సహజానంద, తురగా జానకిరాణి , కేశవపంతులు నరసింహశాస్త్రి , గొల్లపూడి మారుతీరావు , నండూరి విట్టల్ , జనమంచి రామకృష్ణ , అజర్ అఫ్సర్(ఉర్దూ), ఎల్లా వెంకటేశ్వరరావు, వడ్లమూడి గోపాలకృష్ణయ్య, భాస్కరభట్ల కృష్ణారావు , N.V.S. ప్రసాదరావు హైదరాబాద్ కేంద్ర కార్యక్రమ