పుట:Prasarapramukulu022372mbp.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

ప్రసార ప్రముఖులు.

వెదురుమూడి రాజేశ్వరి ఢిల్లీ కేంద్రం తెలుగు వార్తా విభాగంలో న్యూస్ రీడర్ గా 1996 లో చేరారు.

పుల్లెల వెంకటేశ్వర్లు డిప్యూటీ డైరక్టర్ జనరల్ (ప్రోగ్రాం) గా ఢిల్లీ లో 1980-82 సం॥ లలో వ్యవహరించారు. ఆ స్థాయికి ఎదిగిన స్టేషన్ డైరక్టర్ల లో వెంకటేశ్వర్లుగారు అగ్రగణ్యులు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఆకాశవాణిలో చేరిన కెప్టన్ పుల్లెల విజయవాడ, హైదరాబాదు, పోర్ట్ బ్లెయిరు తదితర కేంద్రాలలో పనిచేశారు. హైదరాబాదు కేంద్ర డైరక్టర్‌గా 1975 అక్టోబరు నుండి 78 జూన్‌ వరకు పని చేశారు. అధికారిగా మంచిపేరు సంపాదించారు, డైరక్టర్ ఆఫ్ ప్రోగ్రాం (పాలసీ)గా చక్కటి పేరు గడించారు. పదవీ విరమణానంతరం పుల్లెల హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. ఆర్మీలో పనిచేసి రిటైరైన పుల్లెల విజయవాడలో ప్రథమంగా చేరారు. 1966 లో అసిస్టెంట్ డైరక్టర్‌గా డైరక్టరేట్‌కు బదలీ అయ్యారు.

సూరి నారాయణమూర్తి DDG ప్రోగ్రాంగా పనిచేసిన వారిలో సమర్ధులు. వీరు ప్రోగ్రాం అసిస్టెంట్‌గా చేరి డిడిజి హోదాకు ఎదిగారు. 1971 ఆగష్టులో పదవీ విరమణ చేసి విజయవాడలో విశ్రాంత జీవనం గడుపుతూ 1981 జనవరిలో పరమపదించారు. మదరాసులో చేరి అహమ్మదాబాదు, పూనే, బొంబాయి, ఢిల్లీ కేంద్రాలలో డైరక్టరుగా పనిచేశారు.

ఇంజనీరింగు విభాగంలో కూడా ఎందరో చీఫ్ యింజనీర్ల స్థాయికి ఎదిగి డైరక్టరేట్‌లో పనిచేశారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో పని చేసిన ప్రముఖ చీఫ్ యింజనీర్లలో విశ్వనాథ సత్యనారాయణ గారి కుమారులు విశ్వనాథ అచ్యుత దేవరాయలు, R S, శాస్త్రి, M. L. శాస్త్రి, N. వెంకటేశ్వర్లు, వి. వి. రావ్, టి. యన్. జి డాన్ (కలకత్తా) చెప్పుకోదగినవారు. ప్రాంతీయ కార్యాలయం మదరాసులో చీఫ్ యింజనీర్లుగా M. I. సూర్యనారాయణ, ఆర్ శేషయ్య వ్యవహరించారు. వీరిద్దరి హయాంలో చాలామంది తెలుగు యువకులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా సెలక్టు కాబడి యిప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్ల హోదాకు ఎదిగారు.

డైరక్టర్లుగా డైరక్టరేట్‌లో భిన్న కాలాలలో ఎందరో పనిచేశారు. సర్వశ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు, పుల్లెల వెంకటేశ్వర్లు, గుంటూరు రఘురాం యిలా ఎందరో. రఘురాం జలంధర్‌లో స్టేషన్ డైరక్టరుగా పనిచేసి డైరక్టరేట్‌లో డైర