పుట:Prasarapramukulu022372mbp.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

5

K.V.S. రావు, N.H.K. మూర్తి, D.J. రావు, D.S. దీక్షితులు, V.A. శాస్త్రి, G.N.L.N. రావు వంటి అధికారులు మంత్రిత్వశాఖలో సీనియర్ పదవులు నిర్వహించారు. దీక్షితులు, V.A. శాస్త్రి ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్ఛి వ్యక్తిగత కార్యదర్శులుగా పనిచేశారు. G.V.L.N. రావు ఆకాశవాణి డైరక్టర్ వ్యక్తిగత కార్యదర్ఛిగా రెండేళ్ళు పనిచేసారు. N.H.K. మూర్తి హృద్రోగంతో హఠాత్తుగా మరణించారు. K.V.S. రావు ఆకాశవాణి డైరక్టర్ జనరల్ విజిలెన్స్ సెక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించారు. D.J. రావు దూరదర్శన్, ఆకాశవాణిలలొ పనిచేసి Ministry of Personnel లో డిప్యూటీ సెక్రటరీగా వెళ్ళారు.

డైరక్టరేట్ జనరల్ కార్యాలయం

ఆకాశవాణి డైరక్టరేట్ జనరల్ కార్యాలయం కొత్త ఢిల్లీలోని పార్లమెంటు వీధిలోని ఆకాశవాణి భవనంలో వుంది. ఈ కార్యాలయంలో ఎందరో ఆంధ్ర ప్రముఖులు పనిచేశారు. ఆకాశవాణి మాన్యువల్ రూపొందించిన ఘనత ఆంధ్రులకే దక్కింది. అకౌంటెంట్ జనరల్ గా పనిచేసి డెప్యుటేషన్ మీద ఆకాశవాణి డిప్యూటీ డైరక్టర్ జనరల్ (అడ్మినిస్ట్రేషన్) గా పనిచేసిన P. V. రాఘవరావు ప్రాతఃస్మరణీయులు. వీరు 1956 లో మనుస్మృతి వంటి మాన్యువల్ తయారుచేశారు. 1989 వరకు దానినే అనుసరించారు. 1989 లో మాన్యువల్ కు కొత్తరూపం యిచ్చారు. రాఘవరావుగారు పదవీ విరమణానంతరం హైదరాబాదులో 1992 లో పరమపదించారు. వీరి కుమారులు రాష్ట్రప్రభుత్వ కార్యదర్శిగా పనిచేస్తున్న P. V. రావు.

మరొక ఉన్నతస్థానం అలంకరించిన వ్యక్తి భమిడిపాటి కుక్కుటేశ్వరరావు. వీరు I.A.S.లో పనిచేస్తూ డెప్యుటేషన్ మీద D.D.G. (అడ్మినిస్ట్రేషన్) గా ఆకాశవాణి ఢిల్లీలో పనిచేశారు. వీరు కేంద్ర గనుల శాఖ కార్యదర్శిగా 1990 జూన్ లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు. బి.కె. రావుగా ప్రసిద్ధులైన వీరు జియాలజీలో M.S.c. పట్టభద్రులు, సాహితీప్రియులు. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ సీనియర్ పదవులు అధిష్టించారు. చిత్తూరు కలెక్టరుగా వ్యవహరించారు.

ఇటీవలి కాలంలో D.D.G. సెక్యూరిటీగా వి. పురుషోత్తమరావు పనిచేస్తున్నారు. వీరు డెప్యుటేషన్ పై వచ్చారు. స్వతహాగా పోలీసు (C.R.P.F.) శాఖకు చెందినవారు. (1992-96) మధ్యకాలంలో వీరు ఢిల్లీలో పనిచేశారు. వీరి సతీమణి