పుట:Prasarapramukulu022372mbp.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

ప్రసార ప్రముఖులు.

ఈ తరం అనౌన్సర్లలో సర్వశ్రీ M. వాసుదేవమూర్తి, పన్నాల సుబ్రహ్మణ్యభట్, S. B. శ్రీరామమూర్తి, D. S. R. ఆంజనేయులు ప్రముఖులు. వాసుదేవమూర్తి సెలక్షన్ గ్రేడ్ అనౌన్సరుగా పనిచేస్తున్నారు. ఈయన రూపొందించిన రైలు ప్రయాణం నాటకం ఆకాశవాణి వార్షిక పోటీలలో జాతీయస్థాయి బహుమతి పొందింది. పన్నాల సుబ్రహ్మణ్యభట్ కొంతకాలం మహిళా శిశువిభాగం ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. చెణుకులు కార్యక్రమం ద్వారా శ్రోతలకు పరిచితులు, చక్కని రచయిత, విమర్శకులు రేడియో ప్రసారాలపై ప్రసార తరంగిణి ప్రచురించారు. జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు. మంచి చిత్రకారుడు. శ్రీరామం విశ్శబ్ద గమ్యం, మెట్లు, మహావిశ్వ రూపొందించి జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు.

మల్లాది సూరిబాబు గాత్ర సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. వీరి కుమారులు మల్లాది శ్రీరాం ప్రసాద్ చక్కని గాత్రం గల వ్యక్తి. విజయవాడ కేంద్రంలో తంబురా కళాకారుడుగా ఎన్నికయ్యారు. యువతరం అనౌన్సర్లలో సర్వశ్రీ విజయకుమారి, E. V. కృష్ణశాస్త్రి, శారద జయప్రకాష్, కామేశ్వరి, S. శారద, మాడుగుల రామకృష్ణ గణనీయమైన సేవ చేస్తున్నారు.

కడప కేంద్రం 1963లో ప్రారంభమైనపుడు అనౌన్సర్లుగా సర్వశ్రీ గాడిచర్ల శ్రీనివాసమూర్తి, గుర్రం కోటేశ్వరరావు నియుక్తులయ్యారు. శ్రీనివాసమూర్తి ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు కుటుంబానికి చెందినవారు. కోటేశ్వరరావు న్యాయవాద పట్టా పుచ్చుకొన్నారు. ఇద్దరూ మూడు దశాబ్దాలు పనిచేసి రిటైరయ్యారు. ఆరవీటి శ్రీనివాసులు కొంతకాలం అనౌన్సరుగా పనిచేసి తర్వాత జానపద విభాగం ప్రొడ్యూసరయ్యాడు. తర్వాత అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరయ్యారు. గోపి, రమణమోహన్, వనజారెడ్డి, మంజుల సుమనోహర్ కంఠస్వరం గల యువతీయువకులు.

విశాఖపట్టణం కేంద్రంలో అనౌన్సర్లుగా శ్రీ A. V. S. రామారావు, కుమారి కామాక్షమ్మ, శ్రీమతి కుమారి ప్రముఖంగా చెప్పుకోదగినవారు. రామారావు మంచి నటులు, ప్రయోక్త.