పుట:Prasarapramukulu022372mbp.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

101

యిక్కడే వుండటం ఈ కేంద్రానికి ఆయువుపట్టు. ఇక్కడ పనిచేసిన నాగసూరి వేణుగోపాల్ చక్కని రచయిత. సైన్సు విషయాలపై కృషి చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ బదిలీ అయ్యారు.

తిరుపతి :

శ్రీ వేంకటేశ్వరునికి నెలవైన తిరుపతిలో 1991 ఫిబ్రవరి 1న F. M. కేంద్రాన్ని అప్పటి ప్రసారమంత్రి సుబోద్ కాంత్ సహాయ్ ప్రారంభించారు. తొలి డైరక్టర్ గా యు. రాసయ్య, ఆ తర్వత శ్రీమతి విజయలక్ష్మి సౌందర రాజన్ పనిచేశారు. ఆ తర్వాత సి. రాజారావు అసిస్టెంట్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 1995 లో తిరుమలలో జరిగే సుప్రభాత సేవను ఉదయం 2-30 గం. ల నుండి ప్రత్యక్ష ప్రాసారం చేస్తున్నారు. తిరుమలలో జరిగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ కేంద్రం ప్రసార మాధ్యమం.

కర్నూలు :

1992 మే 1న అప్పటి కేంద్రన్యాయ శాఖామాత్యులు శ్రీకోట్ల విజయభాస్కర రెడ్డి ఈ కేంద్రం ప్రారంభించారు. శ్రీ యన్. పి. గోవర్థన్ ఈ కేంద్రం తొలి డైరక్టరు. శ్రీశైలంలో జరిగే కార్యక్రమాల ప్రసారాలకు ఈ కేంద్రం ప్రాధాన్యత నిస్తున్నది. ఇది F. M. కేంద్రం.

మార్కాపురం :

ఒంగోలు జిల్లాలోని మార్కాపురంలో 1993లో ఆగస్టు 9న F. M. కేంద్రాన్ని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. విజయభాస్కరరెడ్డి ప్రారంభించారు. తొలి అసిస్టెంట్ డైరక్టరు Y. హనుమంతరావు. వీరి తర్వాత కె. వి హనుమంతరావు రెండేళ్ళు ఆ బాధ్యతలు స్వీకరించారు. ఈ కేంద్రం స్థాపనతో ఆంధ్రప్రదేశ్‌లో 12 రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి. గుంటూరు జిల్లా మాచెర్లలో మరో F. M. కంద్ర స్థాపనకు స్థలసేకరణ పూర్తి అయింది.